Pawan Kalyan : గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా కూడా గట్టిగా వినిపించే పేరు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కొంతకాలంగా బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలుకు దూరమయ్యారు. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది.
మొత్తానికి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ మరికొద్ది సేపట్లోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ మొదలుకానున్నాయి. ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించిన టికెట్లు జెట్ స్పీడ్ లో బుక్ అయిపోయాయి. ఇప్పుడు సినిమా రిజల్ట్ బట్టి కలెక్షన్స్ ఉండబోతున్నాయి.
స్టేజ్ పైన ఖుషి పాట
పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ లో ఉన్న టాలెంట్ అంతా చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లోని మంచి సింగర్ ఉన్నాడు. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒకప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఏకంగా పవన్ కళ్యాణ్ చేసేవాడు. అద్భుతమైన జానపదాలను తన సినిమా సీన్స్ లో పాడేవాడు. ఖుషి సినిమాలోని బై బై బంగారు రమణమ్మ పాట గురించి అందరికీ తెలిసిందే. అదే పాటను ఇప్పుడు వైజాగ్ లో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడాడు పవన్ కళ్యాణ్. సినిమాలకు సంబంధించిన సభల్లో పవన్ కళ్యాణ్ పాటలు పాడటం అనేది అరుదు. కొన్నిసార్లు రాజకీయాల్లో ఇచ్చే స్పీచెస్ లో పవన్ పాటలు పాడుతూ ఉండేవారు. చాలా రోజుల తర్వాత సినిమా వేదిక పైన పాట పాడారు.
భారీ ప్రమోషన్
దాదాపు 5 సంవత్సరాల క్రితం మీ సినిమా మొదలైంది. ఒక దర్శకుడు మారిపోయాడు. ఇప్పుడు సినిమాను పూర్తి చేసిన దర్శకుడికి పెద్దగా హిట్ సినిమాలు లేవు. సినిమాను కొనడానికి కొంతకాలం వరకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదు. కానీ నిర్మాత ఏం రత్నం మాత్రం సినిమాను చాలా బలంగా నమ్మారు. సినిమా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు. నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాకి బాగా ప్రమోషన్ చేశారు. సరిగ్గా బజ్ లేదు అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడితో సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. టికెట్లు కూడా మంచి స్పీడ్ న సేల్ అవుతున్నాయి. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం ఒక్కటే మిగిలింది. ఆ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా కలెక్షన్లు కొత్తదారులు వెతుక్కుంటాయి.
Also Read: Nidhhi Agerwal : నిధి అగర్వాల్ పై అలాంటి స్లోగన్స్… సిగ్గుపడిపోయిన హీరోయిన్