HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది మంత్రులు, సినిమా సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ పట్ల అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది .ఈయన ఈ కార్యక్రమంలో ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారని అందరూ ఎదురు చూశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా అభిమానులను (Fans)ఉద్దేశించి మాట్లాడటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో నేను నిర్మాత గురించి మాట్లాడాను. కానీ ఇప్పుడు మాత్రం కేవలం అభిమానుల గురించి మాత్రమే మాట్లాడతానని తెలిపారు.
పవన్ సినిమాకు రూ. 10 టికెట్..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిజానికి ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది అభిమానుల సమక్షంలో జరుపుకోవాలనుకున్నాను కానీ వర్షాభావ కారణాలు, భద్రత కారణాల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన, ఈ కార్యక్రమానికి రాలేకుండా టీవీల ముందు ఈ వేడుకను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం అందరి సినిమాలు వందల రూపాయల టికెట్ల రేట్లతో ఆడుతుంటే ఒక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా మాత్రం పది రూపాయల టికెట్ తో ఆడింది అంటూ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
మనల్ని ఎవడ్రా ఆపేది…
ఆరోజు నేను ఒకటే చెప్పాను “మనల్ని ఎవడ్రా ఆపేది”.. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే అందుకు కారణం మీరే అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నేను నా సినీ కెరియర్ లో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నోసార్లు కింద పడుతూనే ఉన్నాను , లేస్తూనే ఉన్నాను. ఇలా పడిపోయిన ప్రతిసారి నేను పైకి లేచి నిలబడుతున్నాను అంటే అందుకు కారణం మీరు ఇచ్చిన భరోసా అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.
నా మిత్రుడు త్రివిక్రమ్..
నా దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? గుండాలు ఉన్నారా? గుండెల్లో మీరు తప్ప అంటూ అభిమానుల గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. దాదాపు నేను 30 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ 30 సంవత్సరాల కాలం చాలా త్వరగా అయిపోయింది నాకు కాస్త వయసు పెరిగింది కానీ గుండెల్లో చావు బ్రతికే ఉందని ఈయన మాట్లాడారు. తన సినీ కెరియర్ లో వరుస ప్లాప్ సినిమాలు వెంటాడుతున్న సమయంలో అనుకోకుండా నా జీవితంలోకి వచ్చిన నా మిత్రుడు త్రివిక్రమ్ (Trivikram)నాతో జల్సా సినిమా చేసి నన్ను తిరిగి నిలబెట్టారంటూ ఈ సందర్భంగా త్రివిక్రమ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పగా తెలియజేశారు. ఎవరైనా విజయాలను వెతుక్కుంటూ పోతారు కానీ త్రివిక్రమ్ మాత్రం అపజయాన్ని వెతుక్కుంటూ వచ్చి నాకు విజయాన్ని అందించారని ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: HHVM Pre Release Event: వీరమల్లు నాకెంతో ప్రత్యేకం… పవన్ విశ్వరూపం చూస్తారు!