Pawan Kalyan OG : తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చాయా… అంటే నిన్న రిలీజ్ అయినా సినిమాలను చూస్తే అవును అనే అనొచ్చు. కిష్కంధపురి యావరేజ్ టాక్ వచ్చింది. ‘మిరాయ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ రెండు పక్కన పెడితే, ఈ నెల 25న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘OG’ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్ ఫేస్‌లోకి ఎంటర్ అయింది. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ బిజీ షెడ్యూల్‌లో కూడా సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ప్రముఖ డబ్బింగ్ ఇంజనీర్ పప్పు పర్యవేక్షణలో ఈ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ఈ న్యూస్ ఫ్యాన్స్‌కి కాస్త ఊరటనిస్తోంది.
పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ చాలా పెద్దది. అతని స్క్రీన్ ప్రెజన్స్‌తో యావరేజ్ సినిమాలు కూడా కమర్షియల్‌గా సక్సస్ అయ్యాయి. పవన్ లాస్ట్ మూవీ హరి హర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఇది పవన్‌కు ఫస్ట్ పీరియాడిక్ మూవీ. అందులోనూ… మన చరిత్రలో చాలా ఫేమస్ అయిన కోహినూర్ డైమండ్ చుట్టూ జరిగే కథ కావడంతో రిలీజ్ కు ముందు ఎక్సపెక్టేషన్స్ చాలా ఎక్కువే ఉండేవి. కానీ, మూవీ బయటికి వచ్చిన తర్వాత… కొంత వరకు కూడా మ్యాచ్ చేయలేకపోయింది.
ఇప్పుడు ఓజీ సినిమాపైనే పవన్ ఫాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా జానర్ కూడా పవన్ కి చాలా ఇష్టమైనది. పవన్ కళ్యాణ్ చేతిలో గన్స్ పట్టుకుని అందరినీ ఫైర్ చేస్తూ ఉంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ సందర్బంలో చెప్పారు.
అలాంటి గ్యాంగ్‌స్టార్ యాక్షన్ డ్రామాగా ఓజీ తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ లుక్స్, మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ అన్ని క్లిక్ అయి సినిమా మీద అంచనాలు పెంచేసాయి. మరి ఇది హరి హర వీరమల్లు సినిమాలా డిసప్పాయింట్ చేస్తుందా లేదా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందా అని తెలుసుకోవాలి అంటే ఈ నెల 25 వరకు వెయిట్ చేయాల్సిందే.
సినిమా టీజర్ల ప్రకారం పవన్ పాత్రకు జాపనీస్ మాఫియాకు సంబంధం ఉన్నటు అర్ధం అవుతుంది. మూవీ నుంచి వచ్చిన సాంగ్స్‌లో జాపనీస్ భాష లిరిక్స్ ఉండటంతో దీన్ని ఇంకా బలపరుస్తుంది. ఇక కథ అంటే… ప్రియాంక మోహన్ పాత్ర కన్మణి చనిపోతుందని దానివల్లే హైడింగ్ లో ఉన్న ఓజాస్ పగా తీర్చుకోవడానికి బయటికి వస్తాడట. ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీటిలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ట్రైలర్ వచ్చేస్తుంది
ఓజీ సినిమా రిలీజ్‌కు మూవీ టీం మూహుర్తం ఫిక్స్ చేశారట. ఈ నెల 18న ఓజీ ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ట్రైలర్ తర్వాత సినిమాపై బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ట్రైలర్ కంటే ముందే గన్స్ అండ్ రోజెస్ అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.