ఒకప్పుడు ఇండియన్ మొబైల్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత సన్నగా ఉండే ఫోన్ ను తయారు చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్ ఫోన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐఫోన్ ఎయిర్ కంటే కూడా సన్నగా ఉండేది. ఐఫోన్ ఎయిర్ డివైజ్ 5.64mm ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. అమ్మో ఇంత స్లిమ్ ఫోనా? అని ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ, భారతీయ బ్రాండ్ మైక్రోమాక్స్ దీనికంటే తక్కువ సైజులో ఉండే అత్యంత సన్నని స్మార్ట్ ఫోన్ ను తయారు చేసింది. ఆ స్మార్ట్ ఫోన్ పేరు మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్. ఇది జస్ట్ 5 5.1 mm మందం కలిగి అత్యంత సన్నగా ఉండే ఫోన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్ 2015లోనే తయారు కావడం విశేషం.
అల్ట్రా స్లిమ్ ఫోన్ల పోటీ 2010ల మధ్యలో ప్రారంభమైంది. ఈ స్లిమ్ ట్రెండ్‌లో Vivo X5 Max (4.75 mm), Oppo R5 (4.85 mm), Gionee Elife S5.5 (5.5 mm) స్లిమ్ ఫోన్ లు అగ్రస్థానంలో నిలిచాయి. కానీ, తొలుత ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్ ఫోన్ తయారు చేసిన కంపెనీ మైక్రోమాక్స్. కాన్వాస్ సిల్వర్ 5తో స్లిమ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశించింది. ఆ సమయంలో భారతదేశంలో అగ్రశ్రేణి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన మైక్రోమాక్స్, శామ్ సంగ్ తో పోటీ పడింది. ఒప్పో, వివో, ఆపిల్, షియోమిలను అధిగమించింది. సరసమైన ధరల ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన మైక్రోమాక్స్ ఈ ఫోన్ ను రూ. 17,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారి లగ్జరీ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఫోన్ తో ప్రయత్నించింది.
మైక్రోమాక్స్ సిల్వర్ 5 లాంచ్‌ను కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. CEO వినీత్ తనేజా ఈ స్మార్ట్ ఫోన్ సన్నదనం గురించి నేరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పోటీ కంపెనీలతో పోల్చుతూ తమ స్మార్ట్ ఫోన్ గొప్పదనాన్నిచెప్పే ప్రయత్నం చేశారు. ఐఫోన్ 5 కంటే తమ ఫోన్ ఎంత స్లిమ్ గా ఉందో వినియోగదారులకు వివరించి చెప్పారు. అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్ బరువు కేవలం 97 గ్రాములు కావడం విశేషం. హ్యూ జాక్ మన్ ఈ లాంచ్‌కు మద్దతు ఇచ్చే చిక్ ప్రకటనల్లో ప్రచారం చేశారు. ఈ ప్రకటనలో సన్నని డిజైన్ ఉన్నప్పటికీ ఫోన్ మన్నికను హైలైట్ చేసే చిరస్మరణీయ చిత్రం ఉంది. కాన్వాస్ సిల్వర్ 5 బ్రాండ్ ఖ్యాతి బాగా పెరిగింది. కానీ, మైక్రోమాక్స్ ప్రీమియం పొజిషనింగ్ ను కొనసాగించడంలో విఫలమైంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు దాని మార్కెట్ వాటాను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఐఫోన్ ఎయిర్ వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. అది మరేంటో కాదు, ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ ను మొదట ఒక భారతీయ కంపెనీ తయారు చేసింది.
Read Also: వైర్ vs వైర్ లెస్ హెడ్ ఫోన్స్.. ఏది బెస్ట్? ఎందుకు?