HHVM Censor Talk: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా మరికొన్ని రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. నిజానికి జూన్ 12వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడటంతో జులై 24 వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా విడుదలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇక తాజాగా సెన్సార్(Censor) కార్యక్రమాలను కూడా ఈ సినిమా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా గురించి వారి అభిప్రాయాలను తెలియజేశారు.
కోహినూరు వజ్రం..
హరిహర వీరమల్లు సినిమా పట్ల సెన్సార్ సభ్యుల టాక్ ప్రకారం.. ఈ సినిమా ఔరంగజేబు దక్షిణ భారతదేశ అన్ని ఆక్రమించాలని ప్లాన్ చేస్తున్న సమయంలో గోల్కొండ సుల్తానులు బ్రిటిష్ వారి సహాయం కోరుతారు. ఆ సమయంలో వారు కోహినూర్ వజ్రం డిమాండ్ చేస్తారు. మరి కోహినూరు వజ్రాన్ని ఔరంగాజేబు నుండి దొంగలించడం కోసం గోల్కొండ సుల్తానులు పవన్ కళ్యాణ్ (అకా వీరమల్లు) సహాయం కోరుతారు. అయితే కోహినూరు వజ్రాన్ని దొంగలించడం కోసం గోల్కొండ సుల్తానులకు వీరమల్లు ఎందుకు సహాయం చేస్తారు? నిజంగానే వీరమల్లు కోహినూరు వజ్రాన్ని దొంగలిస్తారా? తదుపరి ఏం జరిగిందనే విషయాల పట్ల సినిమా ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
పాజిటివ్ రివ్యూ ఇచ్చిన సెన్సార్…
ఇక ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతుందని, ఈ సినిమా ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదు అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి ఎంతో పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అదేవిధంగా సెన్సార్ సభ్యులు వీరమల్లు సినిమాకు U/A సర్టిఫికెట్ కూడా జారీ చేశారు.సినిమా నిడివి 2:42 నిమిషాలు ఉన్నట్లు తెలిపారు. ఇక సెన్సార్ సభ్యుల రివ్యూ చూస్తుంటే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని అర్థమవుతుంది. ఈ సినిమా పట్ల పవన్ కళ్యాణ్అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి విడుదల కాబోతున్న చిత్రం కావడంతో సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అంచనాలను పెంచిన ట్రైలర్…
ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతుంది.క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా చివరికి జ్యోతి కృష్ణ(Jyothi Krishna) చేతులలోకి వెళ్లి పోయింది. కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో స్వయంగా ప్రొడ్యూసర్ ఏ. యం. రత్నం కుమారుడే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్(Nidhi Aggarwal) నటించిన సంగతి తెలిసిందే. మరి జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.
Also Read: Ileana: సినిమా చేయలేక కన్నీళ్లు పెట్టుకున్న ఇలియానా.. అంత టార్చర్ పెట్టారా?