Ileana: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి ఇలియానా(Ileana) ఒకరు. దేవదాసు(Devadasu) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం సినిమాలను కాస్త పక్కన పెట్టి ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఇలియానా ఒకేసారి ప్రెగ్నెన్సీ గురించి ప్రకటన చేయడంతో ఈమె ప్రెగ్నెన్సీ పై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. ఇక బాబు పుట్టిన తర్వాత తనకు పెళ్లి అయిన విషయాన్ని వెల్లడించారు. తాజాగా మరో చిన్నారికి జన్మనిచ్చి మాతృత్వపు క్షణాలను అనుభూతి చెందుతూ తన పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు.
దేవదాసు..
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించినంత సంతోషంగా సాగవని వారు కూడా ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటారనే సంగతి తెలిసిందే. అయితే ఇలియానా కూడా కెరియర్ మొదట్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. ఈమె రామ్ (Ram) హీరోగా నటించిన దేవదాసు సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. తనకు అదే మొదటి సినిమా కావటం విశేషం.
సినిమాలు వదిలేయాలనుకున్నా..
ఈ సినిమా షూటింగ్ సమయంలో కొత్త వాతావరణం,మొదటి సినిమా షూటింగ్ కావడంతో కాస్త గందరగోళానికి గురయ్యానని తెలిపారు. ఇక్కడి భాష రాదు వర్క్ పరంగా ఒత్తిడి ఎక్కువ కావడంతో తన అమ్మకు ఫోన్ చేసి “నేను సినిమాలు వదిలేస్తానంటూ” ఏడ్చానని ఇలియానా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా సమయంలో నేను భరించిన టార్చర్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. మా అమ్మకు ఫోన్ చేసి ఏడవటం వల్ల ఆమె ధైర్యం చెప్పడంతో నేను సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాగలిగానని ఇలియానా తెలిపారు.
కుటుంబం మద్దతు అవసరం..
ఏదైనా ఒక రంగంలో విజయం సాధించాలంటే ఒత్తిడి ఎదుర్కోని ధైర్యంగా ముందుకు వెళ్లడం ఎంత అవసరమో కుటుంబ సభ్యుల మద్దతు కూడా అంతే అవసరం అంటూ ఈ సందర్భంగా ఇలియానా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా గడుపుతున్నారు. అయితే తిరిగి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించారు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇలా సక్సెస్ సినిమాలు లేక అవకాశాలు లేకపోవడంతోనే ఈమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
Also Read: Gali Kireeti Reddy: గాలి కిరీటి రెడ్డి ఆస్తులు విలువ ఎంతో తెలుసా… సినిమాలు అవసరమా భయ్యా?