BigTV English

Team India: ఏంట్రా ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ.. మహిళల అవతారం ఎత్తారు ఏంటి

Team India: ఏంట్రా ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ.. మహిళల అవతారం ఎత్తారు ఏంటి
Advertisement

Team India: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ} సృష్టిస్తున్న అద్భుతాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఒక్కటేమిటి.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన సత్తా చాటుతుంది. ఏఐ ఎంట్రీ తో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల కొంతమంది ఉద్యోగాలు కోల్పోతుంటే.. మరోవైపు నెట్టింట్లో సంచలనాలకు వేదిక అవుతుంది. ఈ టెక్నాలజీ మనిషి చేసే అన్ని రకాల పనులను చేస్తోంది.


Also Read: IND vs ENG 3rd test: పీకల్లోతు కష్టాల్లో భారత్.. పంత్-రాహుల్ అవుట్.. ఇక మనం గెలవడం కష్టమేనా!

గతంలో ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సహాయంతో రూపొందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ కారణంగా పలు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియోలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా ఈ టెక్నాలజీ అద్భుతమేనని చెప్పినా.. దీనివల్ల అదే స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ముఖ్యంగా దేశంలో ఈ టెక్నాలజీ వల్ల కొందరిలో భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ టెక్నాలజీ ముఖ్యంగా వీడియో మేకింగ్ లో అద్భుతాలను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో క్రికెటర్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ వీడియో కొంతమంది నటిజనులకు విపరీతంగా నచ్చడంతో వారు తెగ షేర్ చేస్తున్నారు. ఏఐ సాయంతో దిగ్గజ టీమిండియా క్రికెటర్లను మార్చేశారు.

ఐపీఎల్ లోని స్టార్ ఆటగాళ్లు మహిళలైతే ఎలా ఉంటారో.. అలా చూపించేశాడు. ఇందులో మహేంద్ర సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, గిల్.. ఇలా దిగ్గజ క్రికెటర్ల ఫోటోలను ఏఐ సాయంతో ఫిమేల్ వెర్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఈ వీడియోలో కేఎల్ రాహుల్ చాలా బాగున్నాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: InD vs eng 3rd test: జులై 14వ తేది…బెన్ స్టోక్స్ కు లక్కీ డే.. ఇండియాను చిత్తు చేయడం గ్యారెంటీనా

ఈ వీడియోకి ఇప్పటికే వేళల్లో లైక్స్ వచ్చి పడ్డాయి. ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తాజాగా గొంతును మార్చే టెక్నాలజీ కూడా వచ్చింది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ.. ఈ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ టూల్ సాయంతో మనుషులు.. ఇతరుల వాయిస్ ని ఇమిటేట్ చేయొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అచ్చంగా ఇది మిమిక్రీ లాంటిది. కేవలం 15 సెకండ్ల నిలిపిగల ఆడియోను రికార్డు చేస్తే చాలు గొంతులను అనుకరిస్తుంది. ఇలా ఏఐ అన్ని రంగాల్లో దూసుకుపోతూ.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది.

?utm_source=ig_web_copy_link

Related News

Asif Afridi: 38 ఏళ్ల వయసులో పాక్ తరఫున అరంగేట్రం..తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు, 92 ఏళ్ల‌లో తొలిసారి

IND VS AUS: అడిలైడ్ పిచ్ పై యూవీ లైట్స్..బీసీసీఐ ప‌రువు తీస్తున్న ఆసీస్‌..!

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ బుట్ట‌లో ప‌డ్డ మ‌రో టాలీవుడ్ హీరోయిన్..సీక్రెట్ రిలేషన్ కూడా ?

IND VS PAK: మ‌రోసారి పాకిస్తాన్ తో టీమిండియా మ్యాచ్‌..నో షేక్ హ్యాండ్స్‌..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్ ఇదే

RSAW vs PAKW: కొంప‌ముంచిన వ‌ర్షం..వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్‌, టీమిండియాకు అగ్ని ప‌రీక్ష‌

BAN vs WI: వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి..50 ఓవ‌ర్లు స్పిన్న‌ర్లే బౌలింగ్…సూప‌ర్ ఓవ‌ర్ వీడియో ఇదిగో

Anushka Sharma: న‌టాషా, ధ‌న శ్రీ ఛీటింగ్‌..మ‌రి అనుష్క మాత్రం అలాంటి ప‌నులు..?

Jasprit Bumrah Grandfather: ఇంటి నుంచి గెంటేసిన ఫ్యామిలీ..బుమ్రా తాత‌య్య ఆత్మ‌హ‌*త్య‌ ?

Big Stories

×