E-Paper
Advertisement

Peddi Movie: పెద్ది మూవీ స్పెషల్ సాంగ్లో హీరోయిన్ ఫిక్స్.. కానీ విడుదల వాయిదా?

Peddi Movie: పెద్ది మూవీ స్పెషల్ సాంగ్లో హీరోయిన్ ఫిక్స్.. కానీ విడుదల వాయిదా?
Advertisement

Peddi Movie: రామ్ చరణ్ (Ram Charan).. తన క్రేజ్ కి తగ్గట్టుగా సక్సెస్ అందుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ‘ఉప్పెన’ సినిమాతో సంచలనం సృష్టించిన సుకుమార్ (Sukumar)శిష్యుడు బుచ్చిబాబు సనా (Bucchibabu Sana)దర్శకత్వంలో ‘పెద్ది’ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో.. స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాటలో నర్తింపచేయడానికి పలువురు హీరోయిన్లు పరిశీలనలోకి రాగా.. ఒక యంగ్ స్టార్ బ్యూటీని ఇప్పుడు రంగంలోకి దింపినట్లు సమాచారం.

పెద్ది స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ మృణాల్ ఠాగూర్(Mrunal thakur) ను మేకర్స్ ఫిక్స్ చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయడమే కాకుండా ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించిన ప్రోమోని కూడా మేకర్స్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రెండవ పాటను కూడా విడుదల చేస్తారంటూ వార్తలు రాగా.. ఇప్పటివరకు దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. మరి స్పెషల్ సాంగ్ ప్రోమోని విడుదల చేస్తారా? లేక రెండో పాటను ఈ సినిమా నుండి విడుదల చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే పెద్ది సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని తెలిసి అభిమానులు ఈ పాటను థియేటర్లలో చూడడానికి తెగ ఎగ్జిట్మెంట్ గా ఎదురుచూస్తున్నారు.

వాయిదా పడ్డ పెద్ది మూవీ..

Advertisement

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా ఏడాది క్రితమే ఈ డేటును కూడా ప్రకటించారు. షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఇక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే అంత పూర్తయి మార్చి 27న ఎందుకు ఈ సినిమా విడుదల వాయిదా పడుతోంది అనే అనుమానాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కారణం సినిమా టికెట్ ధరలు అని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే .. టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎవరైతే నిర్మాతలు తమ సినిమాకు టికెట్ రేటు పెంచాలని ఆలోచిస్తున్నారో మూడు నెలల ముందే ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పైగా నిర్మాతకు టికెట్ ధరలు పెంపడం అన్నది అత్యంత అవసరం. బడ్జెట్ ను రాబట్టుకోవాలన్నా.. కచ్చితంగా సినిమా టికెట్ ధరలు పెంచాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోసమే వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మార్చి 27 నుండి ఈ సినిమాను దసరాకు వాయిదా వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఏది ఏమైనా మార్చి 27న పెద్ది సినిమా రాబోతోందని ఆశించిన అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ:Ranbir Kapoor: ‘యానిమల్’.. 2 కాదు 3.. అసలు ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×