E-Paper
Advertisement

Anantapur YCP: అనంతపురంలో నాన్‌లోకల్‌ హవా..

Anantapur YCP: అనంతపురంలో నాన్‌లోకల్‌ హవా..
Advertisement

Anantapur YCP:  ఉమ్మడి అనంతపురం జిల్లాలో విపక్షం వైసీపీ పరిస్థితి విచిత్రంగా తయారైంది. జిల్లా వైసీపీలో నాన్ లోకల్ నాయకులకే పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రాధాన్యఇస్తుండటంపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు … ఆ క్రమంలో లోకల్ నాయకుల్ని పట్టించుకోవడంలేదన్న ఫీలింగ్ ఎక్కువవుతోందంట… నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టి, తీరా టికెట్లు సమయానికి నాన్ లోకల్ నాయకులు తీసుకొస్తున్నారని స్థానిక లీడర్లు తెగ ఇదై పోతున్నారంట …అసలు అనంత వైసీపీలో ఈ పరిస్థితికి కారణమేంటి?

నంతపురం వైసీపీ లో నాన్ లోకల్ నాయకుల ప్రభావం

అనంతపురం జిల్లా వైసీపీ రాజకీయాల్లో నాన్ లోకల్ నాయకుల అంశం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగానే ఉంది. ముఖ్యంగా 2024 ఎన్నికల సమయంలో ఈ చర్చ ఎక్కువగా నడిచింది… ఎన్నికల ముందు వరకు స్థానిక నాయకులకు వాడుకొని తీరా ఎన్నికలు వచ్చేసరికి ఎక్కడో ఉన్న నాయకులకు పెద్దపీట వేస్తూ ఇక్కడే అనేక ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు మొండి చేయి చూపిస్తుందన్న విమర్శలు అధికమయ్యాయి.

హిందూపురం ఎన్నికలకి పక్క రాష్ట్ర నేతలు

Advertisement

ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం ప్రస్తుత వైసీపీ ఇన్చార్జ్ తలారి రంగయ్యది కర్నూల్ జిల్లా… హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా కర్నూలుకు చెందిన వ్యక్తే … ఇక 2024 ఎన్నికల్లో హిందూపురం నుంచివైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శాంతమ్మ ది ఏకంగా పక్క రాష్ట్రం కర్ణాటక…. పెనుగొండ వైసీపీ ఇన్చార్జ్ ఉషశ్రీ ది కూడా కర్నాటక … ఆ పక్క హిందూపురం అసెంబ్లీ ఇంచార్జి దీపికది కూడా ఇంచుమించు కర్ణాటక రాష్ట్రమే … అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్న దీపికను 2024 ఎన్నికల ముందు హిందూపురంలో బాలకృష్ణపై పోటీకి దించారు జగన్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉన్న ఆమె ఇప్పటికీ హిందూపురం ఇన్చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఇలా పక్క రాష్ట్రాలు, జిల్లాల నేతలనుఎంకరేజ్ చేస్తూ స్థానికంగా పార్టీ కోసం ఉన్న నాయకుల్ని పక్కన పెడుతున్నారని విమర్శలు ఎక్కువయ్యాయి.

పార్టీ నమ్మకం, కానీ గుర్తింపు ఎక్కడ?

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా డజన్ల కొద్ది నాయకులు ముందు నుంచి వైసీపీలో పనిచేస్తున్నారు. అలాంటి వారిని జగన్‌తో పాటు జిల్లా పార్టీ సమన్వయకర్త మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అసలు పరిగణలోకి తీసుకోవడం లేదని క్యాడర్ అసంతృప్తితో కనిపిస్తోంది. ఒక్కసారైనా పదవి మొహం చూడకపోతామా అని రమేష్ గౌడ్ ఎదురు చూస్తున్నారు… ఇటీవల చనిపోయిన జక్కుల ఆదిశేషుకు కూడా చివరి వరకు వైసీపీలో ఎలాంటి పదవి దక్కలేదు… వైసీపీని నమ్ముకుని పార్టీలో చేరిన చెవ్వ రాజశేఖర్‌రెడ్డి లాంటి వ్యక్తులు ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకుని ఉన్నా సరే టికెట్ రాలేదు .. టికెట్ సరే సరైన గుర్తింపు కూడా దక్కడం లేదని, అన్ని పదవులు నాన్ లోకల్ నాయకులకు ఇస్తూ పని మాత్రం తమతో చేయించుకుంటున్నారని సదరు లీడర్లు వాపోతున్నారు.

పదవి కంటే ప్రజాసేవ.. రమేష్ గౌడ్ విజన్

Advertisement

ముఖ్యంగా బీసీ రమేష్ గౌడ్ లాంటి నేతలు అవిర్భావం నుంచి పార్టీ కోసం సేవ చేస్తూ ఎప్పటికైనా వైసీపీలో పదవి రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు… బీసీ వర్గానికి చెందిన రమేష్ గౌడ్ అనేక ఉద్యమాల్లో పాల్గొన్న చురుకైన నేత , వైసీపీ తరపున జిల్లాలో బలమైన వాయిస్ వినిపించగల సామర్థ్యం ఉన్న నాయకుడు…ఇక ఇటీవల మరణించిన జక్కుల ఆదిశేషు కూడా ఇదే కేటగిరీకి చెందిన వ్యక్తి…పదవి కోసం చూసి చూసి తనువు చాలించాడు.

బీసీ సమూహాల్లో అసంతృప్తి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి దన్నుగా ఉన్న బీసీ సామాజికవర్గంలో అనేక కులాలు ఉన్నాయి… కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి కేవలం కురుమ, వాల్మీకి సామాజిక వర్గాలు మాత్రమే టిక్కెట్లు కేటాయిస్తున్నారని మిగిలిన వర్గాల నేతలు అసహనంతో కనిపిస్తున్నారు. .. బీసీ కులాల్లో అనేక ఉపకులాలు ఉన్నాయని వారివైపు కూడా చూడాలని కోరుతున్నారు… బీసీ కులాల్లో గౌడ, రజక, కుమ్మర సామాజిక వర్గాలు వైసీపీకి అండగా ఉంటూ వస్తున్నాయి… కానీ ఎన్నికలు వచ్చేసరికి కేవలం రెండు సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని ఇప్పటికైన ఆ పద్ధతి మారాలని అంటున్నారు.

నాన్ లోకల్ నేతలు ఫెయిల్.. జగన్ తిరిగి స్థానిక బలంపై దృష్టి

వైసీపీలో నాన్ లోకల్ నేతల ప్రభావం ఒకప్పుడు ఎక్కువగా ఉన్న మాట నిజమే… అయితే వారెవరూ జగన్ టార్గెట్లను రీచ్ అవ్వలేకపోయారు. ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఇప్పుడు మళ్లీ స్థానిక బలాన్ని పెంచుకోవడంపై అధిష్టానం దృష్టి సారిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆశావహులు .. మరి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ అధ్యక్షుడి మైండ్‌సెట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Story by: Apparao, Big Tv

ALSO READ:మున్సిపల్ ఎన్నికల బరిలో కవిత.. పోటీ ఎక్కడినుంచంటే!

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×