E-Paper
Advertisement

‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?

‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?
Advertisement

Kiara Advani:సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల గురించి ఏ చిన్న రూమర్ వచ్చినా వైరల్ అవ్వడం కామన్.ఇక పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్స్ గురించి చక్కర్లు కొట్టే గాసిప్స్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ రూమరే కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ల చుట్టూ తిరుగుతుంది.కియారా నటించిన ‘టాక్సిక్’ సినిమాలోని కొన్నిబోల్డ్ సీన్స్ వల్ల ఈ జోడీ మధ్య గొడవలు వచ్చాయని, అవి కాస్తా చివరకు విడాకుల వరకు వెళ్లాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది .

కియారా చేసిన కొన్నిసీన్స్ వల్లే 

Advertisement

వాస్తవానికి వీటికి ప్రధాన కారణం ‘టాక్సిక్’ సినిమాలో కియారా చేసిన కొన్నిసీన్స్ అని తెలుస్తుంది.కన్నడ స్టార్ యశ్ నటించిన ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలైన తర్వాత కియారా నటించిన కొన్ని గ్లామరస్, ఇంటిమేట్ సీన్స్ పై నెటిజన్ల పెద్ద డిబేట్లు పెట్టేశారు. పెళ్లి తర్వాత ఆమె ఇలాంటి సీన్స్ చేయడం సరికాదంటూ కొందరు కామెంట్లు పెట్టారు.

పెద్ద గొడవ జరిగిందన్న రూమర్స్

Advertisement

ఇక అక్కడితో ఆగకుండా, ఆ సీన్స్ వల్లే సిద్ధార్థ్ మల్హోత్రా కియారాపై మండిపడ్డారని,దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందన్న రూమర్స్ పుట్టుకొచ్చాయి. అంతే కాదండోయ్ ..చివరికి సిద్ధార్థ్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కినట్టు కథలు అల్లేశారు కూడా.

బోల్డ్ సీన్స్ చేయడం చాలా కామన్

అయితే రియాలిటీకి వస్తే ఇప్పటివరకు సిద్ధార్థ్ గానీ, కియారా గానీ ఈ విషయంపై ఎక్కడా మాట్లాడింది లేదు.కాబట్టి ఇవి చక్కర్లు కొడుతున్న రూమర్స్ గానే చూడాలి.అయినా నటీ నటులు అన్నాక సినిమాలలో కథ డిమాండ్ మేరకు బోల్డ్ సీన్స్ చేయడం చాలా కామన్.అలాంటిది వీటికే విదాకులంటే ఇప్పటి వరకు ఎన్నో పెళ్ళిళ్ళు పెటాకులు అయ్యేవే !

2023 ఫిబ్రవరిలో పెళ్లి

సిద్ధార్థ్ మల్హోత్రా ,కియారా అద్వానీల విషయానికి వస్తే..‘షేర్షా’ సినిమా సెట్స్‌లో మొదలైన వీరిద్దరి మధ్య పరిచయం  మొదలైంది.అది కాస్తా ప్రేమగా మారి , 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో  వీరి పెళ్లి జరిగింది.  ప్రస్తుతం కియారా బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, సిద్ధార్థ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

తిరుగుతున్న ఒక  రూమర్ మాత్రమే

ఏది ఏమైనా సెలబ్రిటీలు కొద్దిరోజులు కలిసి కనిపించకపోయినా లేదా సినిమాలో ఏదైనా బోల్డ్ సీన్ చేసినా ఇలాంటి వార్తలు రాయడం సోషల్ మీడియాలో ఇపుడు ఒక ట్రెండ్ అయి కూర్చుంది.మొత్తానికి, ‘టాక్సిక్’ సీన్స్ వల్ల కియారా-సిద్ధార్థ్ విడాకులు తీసుకోబోతున్నారనేది కేవలం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక  రూమర్ మాత్రమే అని చెప్పకతప్పదు !

ALSO READ:జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

Tags

Related News

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

తాప్సీ ఎందుకింత కష్టం.. నీ వల్ల కాదులే – నెటిజన్స్ ట్రోల్స్!

ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!

బన్నీతో ఆ ఒక్క సీన్.. వైష్ణవిచైతన్యకి చుక్కలు కనిపించాయట!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుమంత్!

Big Stories

Advertisement
×