Disha patani : బాలీవుడ్ యాక్టర్స్ దిశాపటాని గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కూడా పరిచయమైంది. నో బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. కానీ దిశా పటానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
అలానే నీరజ్ పాండే దర్శకత్వంలో సుశాంత్ సింగ్ నటించిన ఎమ్మెస్ ధోని సినిమా దిశాపటానికి మంచి పేరు తీసుకొచ్చింది. తన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవ్వకపోయినా కూడా.ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్. జిమ్, డాన్స్, ఫ్యాషన్ ఫొటోస్ ఎక్కువగా షేర్ చేస్తుంది.
అయితే కొన్ని రోజులు ముందు బాలీవుడ్ నటి దిశాపటాని ఇంటి ముందు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ నిందితులను పట్టు అయితే తాజాగా నిందితులను ఘజియాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులను పట్టుకునే క్రమంలో వారు పారిపోవడంతో వారిని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతులు అరుణ్, రవీంద్రగా గుర్తించారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్కు చెందినవారుగా గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం