BigTV English

Meal Delivery: జొమాటోతో మేక్ మై ట్రిప్ జోడీ, ఇక రైల్వే ప్రయాణీకులకు నేరుగా ఫుడ్ డెలివరీ!

Meal Delivery: జొమాటోతో మేక్ మై ట్రిప్ జోడీ, ఇక రైల్వే ప్రయాణీకులకు నేరుగా ఫుడ్ డెలివరీ!

Meals On Trains:

భారతీయ రైల్వే ఈ క్యాటరింగ్ సేవలకు రోజు రోజుకు మరింత డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేక్ మై ట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ యాప్ తో జోడికట్టి, రైల్వే ప్రయాణీకులకు నేరుగా ఫుడ్ డెలివరీ అందించబోతోంది.  ప్యాసింజర్లకు వేడి వేడి ఫుడ్ అందించడంతో పాటు మంచి లాభాలు సాధించాలని భావిస్తోంది. ఇండియన్ రైల్వేలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 90,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రతిరోజూ ఇ-క్యాటరింగ్‌ సర్వీసును ఉపయోగించుకున్నారు. గత ఏడాదితో పోల్చితే 66 శాతం పెరుగుదల కనిపించింది.


ఇకపై మరింత ఫాస్ట్ గా ఫుడ్ డెలివరీ

రోజు రోజుకు రైల్వే ప్రయాణీకులు ఈ క్యాటరింగ్ సేవల పట్ల మక్కువ ఎక్కువ చూపిస్తున్న నేపథ్యంలో సకాలంలో ఆర్డర్లకు సపోర్టు చేయడానికి మేక్‌ మై ట్రిప్ దాని లైవ్ ట్రైన్ స్టేటస్ టూల్ ను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తోంది. ప్రయాణీకులు రియల్-టైమ్ రైలు మూమ్ మెంట్స్ ఆధారంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ విషయాన్ని మేక్‌ మై ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాజ్ రిషి సింగ్ వెల్లడించారు. “ప్రయాణీకులకు ఎక్కువ ఆప్షన్స్, సౌకర్యాన్ని అందించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడంలో మేం మరో ముందడుగు వేయబోతున్నాం. ఇందుకోసం జొమాటోతో చేతులు కలిపాం. ఆ సంస్థ సహకారంతో ప్రయాణీకులకు మరింత మెరుగ్గా ఫుడ్ డెలివరీ అందించబోతున్నాం. ఈ క్యాటరింగ్ రంగంలో జొమాటోతో కలిసి కొత్త ఊపును తీసుకురాబోతున్నాం” అని ఆయన అన్నారు.

Read Also:  అక్కడ రైళ్లు ఆకాశాన్ని తాకుతాయి, అమ్మో ఆ స్టేషన్ అంత ఎత్తులో ఉందా?


దీపావళి నుంచి ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభం

దీపావళి నుంచి జొమాటో, మేక్ మై ట్రిప్ భాగస్వామ్యంలో రైల్వే ప్రయాణీకులకు ఫుడ్ డెలివరీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రమోషన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. మేక్‌ మై ట్రిప్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులు జొమాటో ఆర్డర్లపై రీడీమ్ చేసే ఉచిత కూపన్‌ ను అందుకుంటారు. ఈ భాగస్వామ్యం రైలు ప్రయాణీకుల కోసం ఆన్ బోర్డ్ డైనింగ్, బ్లెండింగ్ సౌలభ్యంను కలిగించనుంది. ప్రయాణీకులు అప్పటికప్పుడు వేడి వేడి ఫుడ్ డెలివరీ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. అటు ప్రయాణీకులు కూడా మేక్ మై ట్రిప్, జొమాటో కలయికతో మెరుగైన ఫుడ్ డెలివరీ సేవలు అందే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నచ్చిన ఫుడ్ క్షణాల్లో డెలివరీ తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.

Read Also: రూ. 4 వేల కోట్లతో కేదార్‌నాథ్ లో కళ్లు చెదిరే రోప్‌వే.. ఇది ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్!

Related News

Canadian Influencer: ఇండియన్ రైల్ ఎక్కిన కెనడా అమ్మాయి.. రైల్వే గురించి ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు అవుట్!

Finland: ఫిన్‌ లాండ్ లో ఇండియన్స్ పర్మినెంట్‌గా ఉండిపోవచ్చట.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

Vande Bharat Trains: హైదరాబాద్ నుంచి ఆ నగరాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు!

Trains Cancelled: సికింద్రాబాద్‌కు వెళ్లే ఈ రైళ్లు క్యాన్సిల్.. కొన్ని డైవర్ట్!

Diwali Special Trains: దీపావళికి ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ఏయే రూట్లలో అంటే?

Railway Rules: రైల్వే కొత్త రూల్.. ఇకపై మొదటి 15 నిమిషాలు వారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి!

Kedarnath Ropeway: రూ. 4 వేల కోట్లతో కేదార్‌నాథ్ లో కళ్లు చెదిరే రోప్‌వే.. ఇది ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్!

Big Stories

×