BigTV English

Pawan Kalyan vs Sathyaraj: పవన్‌పై కట్టప్ప తిరుగుబాటు.. సత్యరాజ్ కామెంట్లకు అర్థమేంటి?

Pawan Kalyan vs Sathyaraj: పవన్‌పై కట్టప్ప తిరుగుబాటు.. సత్యరాజ్ కామెంట్లకు అర్థమేంటి?

Pawan Kalyan vs Sathyaraj: పవన్ కళ్యాణ్ వర్సెస్ కట్టప్ప సత్యరాజ్. పవన్ సినిమాలో ఒక పక్క నటిస్తూ.. అదే సమయంలో పవన్‌ని ఇంతగా ద్వేషించడం వెనక కారణాలేంటి? తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న సత్యరాజ్ మెగా హీరోల్లో ప్రముఖుడు, రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయిన పవన్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంలో రీజనేంటి? అసలేంటీ పవనిజం వర్సెస్ కట్పప్ప ఇజం? ఇప్పుడు చూద్దాం.


తెలుగు నాట ఎన్టీఆర్, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్

సత్యరాజ్ అతి పెద్ద పెరియార్ ఫాలోయర్తమిళనాట సినిమాల నుంచి సీఎం అయిన ఎంజీఆర్, తెలుగు నాట ఎన్టీఆర్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అంటూ.. పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పారు సత్యరాజ్. హరిహర వీరమల్లులో ఒక పాత్ర పోషిస్తున్న ఆయన.. పవన్ రాజకీయంగా ఇంత పెద్ద స్థాయికి చేరడం తనకు ఎంతగానో సంతోషంగా ఉందంటూ.. కామెంట్ చేశారు కట్టప్పగా తెలుగులో సుపరిచితులైన సత్యరాజ్.


ఉన్నట్టుండి పవన్‌తో రివర్స్ అయిన సత్యరాజ్

అంతా బాగుందనుకుంటున్న తరుణంలో.. సత్యరాజ్ ఉన్నట్టుండి పవన్‌పై రివర్స్ అయ్యారు. ఇందుకు కారణం.. తమిళనాట మురుగన్ మానాడు అని పెట్టిన ఒక సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అక్కడ తమిళ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

మేం పెరియార్ సిద్ధాంతాలు నమ్మే వారం-సత్యరాజ్

ఇదొక ఆధ్యాత్మిక సభ. దీన్నందరూ పాజిటివ్‌గా తీస్కుంటారునుకుంటే పవన్ తో కలసి ఇటీవలే ఒక సినిమాలో నటించిన సత్యరాజ్ సడెన్ గా ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చి సంచలన కామెంట్ చేశారు. VCK అనే పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే ఇక్కడ కుదరదని అన్నారు. పెరియార్ సిద్దాంతాలు నమ్మే మమ్మల్ని ఎవరూ మోసం చేసయలేరని అన్నారు. మీరు పాల్గొన్న సభతో మమ్మల్ని మోసం చేశారనుకుంటే అది తెలివి తక్కువ తనమే అవుతుందని.. తమిళ ప్రజలు ఎంతో తెలివైన వారనీ.. మీ ఆటలు ఇక్కడ సాగవంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అన్నారు సత్యరాజ్. దేవుడి పేరిట తమిళనాడులో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా సత్య రాజ్ వైపు అందరి దృష్టి మరలింది.

అధికార డీఎంకేపై విమర్శలు చేసిన పవన్

సత్యరాజ్ ఇంతగా రియాక్ట్ కావడానికి గల కారణం.. పవన్ అధికార డీఎంకే పార్టీపై విమర్శలు చేయడం. నాస్తికులు దేవుడ్ని నమ్మాల్సిన అవసరం లేదనీ. అయితే మన దేశంలో నాస్తికులు హిందువులను ఎంపిక చేసుకుని టార్గెట్ చేస్తుంటారని అనడంతో.. ఈ మొత్తం వివాదం మొదలైనట్టు తెలుస్తోంది.

పవన్ ని పొగిడిన నోటితోనే సత్యరాజ్ విమర్శలు

మొన్నటి వరకూ పవన్‌తో ఎంతో బాగా సఖ్యంగా ఉన్న సత్యరాజ్ ఇంత సడెన్‌గా రివర్స్ కావడానికి గల కారణమేంటి? ఒక సినిమా స్టార్ రాజకీయంగా ఇంత పెద్ద స్థాయికి చేరడాన్ని చూసి సంతోషంగా ఉందన్న నోటితోనే ఇలా తీవ్ర స్తాయిలో విమర్శలు చేయడమేంటి? రాజకీయంగా ఆయన బీజేపీలాంటి జాతీయ పార్టీతో పొత్తులో ఉన్నారు. దీంతో దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రచారాలకు రావడం అన్నదొక భాగం. దాన్ని ఇంత సీరియస్‌గా తీసుకోవడమేంటన్నది చర్చనీయాంశంగా మారింది.

మిర్చి, శంఖం, బాహుబలి వంటి తెలుగు మూవీస్ చేసిన సత్యరాజ్

సత్యరాజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో.. మిర్చి నుంచి మొదలు పెడితే శంఖం, ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. అంతే కాదు, ఆయన బాహుబలిలో కట్టప్ప ద్వారా పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయ్యారు కూడా. అంతేనా ఆయన ప్రస్తుతం చెబుతున్న పెరియార్ అనే బయోపిక్ లోనూ నటించారు.

బాహుబలితో పాన్ ఇండియా లెవల్లో పాపులర్

ఒక రకంగా చెబితే సత్యరాజ్ ఇన్ని సినిమాలు చేయడం వేరు బాహుబలి చేయడం వేరు. అప్పటి వరకూ సౌత్ మూవీ ఆర్టిస్టుగానే పరిచయమున్న సత్యరాజ్ బాహుబలితో పాన్ ఇండియా లెవల్లో పాపులర్ చేసింది తెలుగు సినిమా. అంతే కాదు తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన తరచుగా చేస్తూ వస్తున్నారు. ఆ మాటకొస్తే ఆయన తాజా తెలుగు చిత్రం పవన్ నటించిన హరిహర వీరమల్లు.

మెగా హీరోల మార్కెట్ వందల కోట్లలో ఉంటాయ్

దానికి తోడు పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవడం అంటే సత్యరాజ్ ఒక మెగా హీరోస్ కాంపౌండ్‌తో పెట్టుకోవడమే. ఆయన గతంలో మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ మూవీ ప్రతిరోజూ పండగే అనే చిత్రంలో నటించారు కూడా. ఒక పక్క మెగా హీరోలతో యాక్ట్ చేస్తూ మరో పక్క మెగా హీరోల్లోనే రాజకీయంగానూ కీ రోల్ ప్లే చేస్తున్న పవన్ ని ఇంత ఘాటుగా విమర్శించడం అంటే తన మార్కెట్‌ని తనే కోల్పోవడం అన్నది జనసైనికుల మాట. అందుకే పవన్‌తో పెట్టుకున్న వాళ్లు ఇప్పటి వరకూ బతికి బాగు పడ్డట్టు చరిత్రలో లేదంటూ.. సోషల్ మీడియా పోస్టులతో సత్యరాజ్‌ని మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు.

పవన్ డీఎంకేని అనడంతో రియాక్టైన సత్యరాజ్?

ఒక రకంగా చెబితే సత్యరాజ్ చేసింది సాహసమే అంటున్నారు కొందరు. ఎందుకంటే చిరంజీవి దగ్గర నుంచి పవన్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోల సినిమాలు ఏటా ఏదో ఒకటి రిలీజ్ అవుతూనే ఉంటాయి. వీటి మార్కెట్ విలువ కొన్ని వందల కోట్ల రూపాయల మేర ఉంటుంది. అలాంటి మార్కెట్ గల హీరోలతో సినిమాలు ఒక పక్క చేస్తూ సత్యరాజ్ ఇలాంటి కామెంట్లు చేయడం వెనక గల కారణమేంటన్నదొక చర్చ. అయితే ఈ ఏడాది జనవరిలో సత్యరాజ్ కుమార్తె దివ్య డీఎంకేలో అధికారికంగా చేరారు. దీంతో ఆయన డీఎంకేకి వ్యతిరేకంగా పవన్ చేసిన కామెంట్లకు రియాక్టయ్యారని అంటారు. అందుకే ఆయన తన సినిమా మార్కెట్‌ని కూడా లెక్క చేయక ఈ కామెంట్లు చేసినట్టుగా భావిస్తున్నారు.

సత్యరాజ్ అతి పెద్ద పెరియార్ ఫాలోయర్

తమిళనాడులో ప్రతి హీరోకి ఒక పార్టీ ఉంటుంది. ఇక్కడ సినిమా రాజకీయం జోడు గుర్రాలు. ఇది ఎంజీఆర్ నుంచి కరుణ, జయలలితతో ఆగలేదు. ఇక్కడ రామరాజ్, కార్తీక్, నెపోలియన్ ఇలా ఎందరో తమిళ కథానాయకులు అయితే ఒక పార్టీ పెట్టడం లేదంటే ఏదైనా ప్రముఖ పార్టీలో చేరడం షరా మామూలు. అలా చూస్తే సత్యరాజ్ మొన్నటి వరకూ కూడా కేవలం సినిమాలే చేస్తూ వచ్చారు. తన కుమార్తె ఎప్పుడైతే డీఎంకే తీర్ధం పుచ్చుకున్నారో.. అప్పటి నుంచీ ఆయన పొలిటికల్ కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారని అంటారు. దానికి తోడు ఆయన పెరియార్ సినిమా చేయడం మాత్రమే కాకుండా ఆయన ఫాలోయర్ కూడా కావడంతో.. ఇదిగో ఇదీ పరిస్థితి.

త్యరాజ్ చేసిన కామెంట్లకు అర్ధమేంటి?

తమిళనాడు రాజకీయాలను ఈ ద్రవిడ వాదం ఎందుకంత ప్రభావితం చేస్తుంది? దీనంతటికీ కారణం ఏమై ఉంటుంది? పెరియార్ ద్రవిడ వాదం అంటే ఏమిటి? సత్యరాజ్ చేసిన కామెంట్లకు అర్ధమేంటి? అసలీ ద్రవిడ వాదం ఎప్పటి నుంచీ మొదలైంది? దీని కొనసాగింపు ఎలాంటిది?

ద్రవిడ వాదానికి పెట్టింది పేరు పెరియార్

ముందరకాళ్ల బంధంగా ముందే పవన్ కట్టడితమిళనాడులో.. ద్రవిడ వాదానికి పెట్టింది పేరు పెరియార్. ఇక్కడ ఏదైనా పార్టీ పెట్టాలంటే అందులో ద్రవిడ పదం తప్పనిసరి. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పేరు DMK. అంటే ద్రవిడ మున్నేట్ర కళగం అని అర్ధం. జయలలిత సీఎంగా అంతకు ముందు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఎదిగిన పార్టీ పేరు అన్నా ద్రవిడ మున్నెట్ర కగజం. అక్కడ ద్రవిడ అనే శబద్ధంతో ఉన్న పార్టీలు ఐదు వరకూ ఉండగా.. వాటి పేర్లు వరుసగా డీకే పార్టీ, డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే. వీటిటిలోని డీ అంటే ద్రవిడ అన్న పదానికి సూచిక.

జస్టిస్ పార్టీతో ఆత్మగౌరవ ఉద్యమం మొదలు

అప్పట్లో కాంగ్రెస్ బ్రాహ్మణ ఆధిపత్య ధోరణిలో ఉండేది కాబట్టి.. ఆత్మగౌరవం కోసం బ్రాహ్మణేతర పార్టీగా అవతరించింది జస్టిస్ పార్టీ. 1917లో మొదలైన ఈ పార్టీ.. ద్వారా ఆత్మగౌరవ ఉద్యమం మొదలైంది. తర్వాత ద్రవిడర్ కగజం, ద్రవిడ మున్నేట్ర కగజం, తమిళ జాతీయ పార్టీ, అన్నాడీఎంకే, ఎండీఎంకే ఇలా ద్రవిడ వాదాన్ని భుజానికెత్తుకుని ముందుకొచ్చిన పార్టీలు చాలానే. వీటిలో ప్రస్తుతం రెండు ద్రవిడ పార్టీలు మాత్రమే పెద్ద ఎత్తున క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాయి.

2005లో విజయ్ కాంత్ పార్టీలోనూ ద్రవిడ పదం

2005లో సినిమా స్టార్ విజయ్ కాంత్ ద్రవిడ శబ్ధంతో పెట్టిన పార్టీనే చివరిది. తర్వాత సినిమా నటుల కోవలోంచి వచ్చిన కమల్, విజయ్ కూడా పార్టీలు పెట్టారుగానీ.. ఇందులో ద్రవిడ శద్ధం కనిపించలేదు. కమల్ మక్కల్ నీతి మయ్యం అంటూ తన పార్టీకి నామకరణం చేయగా.. విజయ్ పార్టీ పేరు తమిళ వెట్రి కళగం.

పార్టీలో ద్రవిడత్వం లేకున్నా.. కమల్ మాటలనిండా ద్రవిడ వాదమే

దేశంలో భాషల పరంగా ఆర్య, ద్రవిడ భాషలుగా విడిపోవడం. వాటి ద్వారానే ద్రవిడ వాదం అంటూ ఒకటి పుట్టుకొచ్చింది. వీటి ప్రధాన ఉద్దేశం ఒకటి హిందీని వ్యతిరేకించడం రెండు ద్రవిడ వాదం వినిపించడం. ఈ ద్రవిడ రాజకీయం విజయ్ కాంత్ వరకూ ఎంతో ప్రముఖంగానే సాగింది. కమల్, విజయ్ తమ పార్టీ పేర్లలో ఈ ద్రవిడ పదాన్ని తొలగించడంతో.. ఈ ద్రవిడ ప్రభావం తగ్గిందనే అనుకున్నారంత. అయితే కమల్ హాసన్ పార్టీకి ద్రవిడ పదం లేదన్న మాటేగానీ ఆయన రాజకీయం మొత్తం ద్రవిడత్వంతో ముడి పడి ఉంటుంది. అందులో భాగంగా ఆయన దక్షిణాది భాషా రాష్ట్రాలంతా ఒక్కటై కేంద్రంపై తిరుగుబాటు చేయాలన్న పిలుపునిచ్చారు.

నాన్ ద్రవిడియన్ పార్టీగా పేరు పడ్డ విజయ్ పార్టీ

ఒక రకంగా చెబితే విజయ్ ది మాత్రమే నాన్ ద్రవిడియన్ పార్టీగా చెప్పాల్సి ఉంటుంది. తమిళ స్పీకర్ చెప్పడాన్ని బట్టీ చూస్తే విజయ్ పార్టీ వెనక బీజేపీ ఉందని అంటారు. రజనీకాంత్ ద్వారా సాధ్యం కాని పని విజయ్ ద్వారా నెరవేర్చాలనుకోవడం ఇదే చెబుతుందని అంటారు తమిళనాడు స్పీకర్ అప్పావు.

ద్రవిడత్వంలోని మరో మతలబు స్థానికత

ఇప్పుడు తాజాగా సత్యరాజ్ నోటి వెంట పెరియార్ ద్రవిడ వాదం వినిపిస్తోంది. ఇక్కడ ఎవరెంత హిందుత్వం అవలంభించినా.. రాజకీయంగా మాత్రం అందరిదీ ఒకటే దారి. అదే ద్రవిడ దారి. ఈ దారిలో వారు ప్రయాణించకుంటే ఇక్కడ రాజకీయ మనుగడ కష్టం. ఈ ద్రవిడత్వంలోని మరో మతలబు స్థానికత. స్థానిక నాయకత్వమే తమిళనాడును పాలించాలన్న కోణంలో మొదలైన ఉద్యమమే ద్రవిడ ఉద్యమం. అణ్నాదురై నుంచి ఇప్పటి వరకూ తమిళనాడును పాలించిన వారంతా నాన్ కాంగ్రెస్ సీఎంలే. కాంగ్రెస్ ని రాష్ట్ర పాలన నుంచి దూరం చేయడమే ఈ ద్రవిడ రాజకీయం ప్రధాన ఉద్దేశం. అందుకే రజనీకాంత్ తాను ఆధ్యాత్మిక రాజకీయాలను చేయాలనుకుంటున్నట్టు ప్రకటిస్తే ఆయన్ను ఇక్కడి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. శీమాన్ వంటి వారు రజనీని పెద్ద ఎత్తున బెదిరించినట్టు కూడా కనిపించింది.

పవన్ అధికార పార్టీపై కామెంట్ల కాకతో గొడవ

తమిళ ప్రజలకు ఆధ్యాత్మికత, దైవ భక్తి ఎంతో ఎక్కువ. ఇక్కడ అడుగడుగునా వినాయకుడి గుడి కనిపిస్తుంది. కర్ణాటకలో లింగాయత్ ఒక మతం ఎలాగో.. తమిళనాట మురుగన్ పై భక్తి కూడా ఒక ప్రత్యేకమైన మతం లాంటిదే. సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఆరు క్షేత్రాలుండేది కూడా తమిళనాడులోనే. అవేంటో చూస్తే.. తిరుప్పరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి, ప‌ళ‌ముర చోళై. అందుకే ఇక్కడ మురుగన్ మానాడు అనే సభ నిర్వహించారు. ఈ సభకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ అధికార డీఎంకే పై విరుచుపడ్డంతో మొదలైంది అసలు గొడవ.

సనాతన ధర్మంపై ఉదయనిధి సంచలన కామెంట్లు

ఇక్కడ మరో పోలిక ఏంటంటే గతంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం గురించి చేసిన వివాదాస్పద వాఖ్యలు ఉండనే ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఉదయనిధికి సమ ఉజ్జీ అయిన అంతే సమాన స్తాయిలో అధికారం గల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ సారధిగా గత కొంతకాలంగా ప్రచారమవుతూ వస్తున్నారు. అలాంటి పవన్ ఇక్కడికొచ్చి డీఎంకేకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతో పాత పగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తాజాగా డీఎంకేలో తన కుమార్తె చేరడం ద్వారా తాను కూడా ఆ పార్టీ సింపతైజర్ గా మారిన సత్యరాజ్ పవన్ టార్గెట్ గా ఈ కామెంట్లు చేశారు.

2026- తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం?

బేసిగ్గా పవన్ జాతీయ పార్టీ బీజేపీతో టై అప్ లో ఉన్నారు. తద్వారా ఆయన వచ్చే 2026- అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు. దీంతో స్థానిక తెలుగు ఓటు బ్యాంకును ఆకర్షించే అవకాశం కూడా లేక పోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డీఎంకే ఇచ్చిన సూచన మేరకు సత్యరాజ్ ఈ దిశగా పవన్ వ్యతిరేక కామెంట్లు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ముందరకాళ్ల బంధంగా ముందే పవన్ని కట్టడి చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. మరి చూడాలి.. ఈ కామెంట్ల కాక ఏ రాజకీయ తీరం చేరనుందో.. తేలాల్సి ఉంది.

Related News

Akhanda 2: ఇట్స్ అఫీసియల్… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య… ఇక ఓజీ ఒంటరిగానే

S.V.Krishna Reddy: వేదవ్యాస్ గా రాబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోయిన్ గా కొరియన్ నటి

Dil Raju : రాజుగారిని ఆదుకోవాలంటే… ప్రతి సారి పవనేశ్వరుడే రావాలా ?

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Om Raut: ఇదేం కర్మ రా బాబు, సినిమా వచ్చి వెళ్లిపోయిన ఈ దర్శకుడికి తిట్లు మాత్రం తప్పట్లేదు

Kingdom OTT: ఇక్కడ కూడా అభిమానులకు నిరాశే..

Big Stories

×