Kannappa Movie : ఎన్నో ట్రోల్స్ ఎదుర్కున్న కన్నప్ప మూవీ ఈ రోజు థియేటర్స్‌లోకి వచ్చింది. సినిమాపై చాలా మందికి నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మంచు విష్ణు. ఆయన ఇలాంటి పాత్రను మేనేజ్ చేయగలడా? అనేది అందరి ముందు ఉన్న ప్రశ్న. అయినా… సినిమా కోసం చాలా మందే వెళ్లారు. కొన్ని థియేటర్స్ హౌజ్ ఫుల్ అయ్యాయి. కారణం.. ప్రభాస్. అలాగే భక్తి.
ఇండియాలో శివ భక్తులు ఎక్కువగా ఉంటారు. పూరాణాల్లో శైవ భక్తులకు, విష్ణు భక్తులకు గొడవలు జరిగాయని కూడా ఉంది. దశావతారం అనే సినిమాలో అది మనం చూశాం కూడా. ఈ గొడవలు గురించి పక్కన పెడితే, ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో శైవ మతం అంటే శివ భక్తులు ఎక్కువగా ఉంటారు అనేది అందరికీ తెలిసిన నిజం.
అందుకే శివుడు పేరుతో సినిమాలు వస్తే జనాలు తప్పకుండా విజయం చేసి పెడుతారు. ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. హిట్ అయ్యాయి. శివుడి పాత్రలో చేసిన చిరంజీవిని ఇప్పటికీ కూడా శివుడు ఫోటోలతో ప్రచారం చేస్తారు.
అలాంటి శివుడు పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేశారు ఈ రోజు. అదే కన్నప్ప. కన్నప్ప అంటే శివుడు భక్తుడు. భక్త కన్నప్ప అని 1976 లోనే కృష్ణం రాజు ఓ సినిమా చేశాడు. ఈ సినిమాతోనే భక్త కన్నప్ప గురించి అందరికీ తెలిసింది అని చెప్పొచ్చు. మళ్లీ ఇన్నాళ్లకు కన్నప్ప గురించి మరో సినిమా వచ్చింది. మంచు విష్ణు, మోహన్ బాబు దీన్ని నిర్మించారు. విష్ణునే కన్నప్ప పాత్రలో నటించాడు.
ఇక సినిమాలోకి వెళ్తే… ముందుమాటగా… మంచు మోహన్ బాబు వాయిస్ వినపడుతుంది. ఆ ముందుమాటలో చివరన గమనిస్తే… ఓ మంచి భక్తి సినిమాను ప్రేక్షకులకు చూపించడానికే ఈ సినిమాను తెరకెక్కించామని అంటాడు మోహన్ బాబు.
నిజానికి సినిమా ఓ అద్భుతమైన భక్తిరస చిత్రమనే ప్రచారం చేశారు. సినిమా కూడా భక్తి రస చిత్రంగానే ఉంది. క్లైమాక్స్ అయితే శివ భక్తులకు పూనకాలు అనే చెప్పాలి.
అయితే, ఈ సినిమాలో ఓ రెండు సాంగ్స్ ఉన్నాయి. ఈ భక్తిరస చిత్రంలో ఓ రెండు సాంగ్స్ ఉన్నాయి. ఆ రెండు సాంగ్స్‌లో హీరోయిన్ దాదాపు అర్థనగ్నంగానే కనిపిస్తుంది. సాంగ్స్ మాత్రమే కాదు… తిన్నడు – నెమలి మధ్య వచ్చే కొన్ని సీన్స్‌లో కూడా అలాంటిదే కనిపిస్తుంది. ఇది భక్తి సినిమా అని చూడటానికి వచ్చే వాళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఆ రెండు సాంగ్స్ చూసిన తర్వాత మనం భక్తి సినిమాకే వచ్చామా ? అనే క్వశ్చన్ వచ్చేలా ఆ సాంగ్స్ ఉన్నాయి. ఇలాంటి భక్తి సినిమాలో అలాంటి సాంగ్స్ పెట్టాలనే థాట్ ఎవరికి వచ్చిందయ్యా అని అంటున్నారు సినిమా చూసిన వాళ్లు.
ఆ రెండు సాంగ్స్ పెట్టకుండా ఉంటే ఫస్టాఫ్ రిజల్ట్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.