BigTV English

Anushka Shetty: ఢిల్లీకి భార్యగా స్వీటీ.. లోకేషూ.. నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా

Anushka Shetty: ఢిల్లీకి భార్యగా స్వీటీ.. లోకేషూ.. నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా

Anushka Shetty: లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు విజయశాంతి తరువాత అంతగా యాప్ట్ అయ్యింది కేవలం అనుష్క శెట్టికి మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందం, అభినయం కలబోసిన మగువగా తెలుగువారి గుండెల్లో అనుష్క చిరకాలం గుర్తుండిపోతుంది. సూపర్ అనే సినిమాతో సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన  స్వీటీ.. తన అందంతో, నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అరుంధతీ లాంటి సినిమా తరువాత ఏ హీరోయిన్ కూడా బిల్లా లాంటి సినిమా చేయదు. కానీ, స్వీటీ ఆ రెండు పాత్రలను అవలీలగా చేసేసింది. అంతలా తన నటనతో మెప్పించిన స్వీటీ.. వరుస సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా మారింది.


 

ఇక సైజ్ జీరో తరువాత బరువు పెరగడంతో స్వీటీ సినిమాలకు దూరమయ్యింది. ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడింది. అయినా ఆమె నటనకు ఆ బరువు అడ్డు కాదని అభిమానులు నిరూపించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న స్వీటీ ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగులో ఘాటీ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. కన్నడలో ఒక సినిమా సెట్స్ మీద ఉంది. ఇక ఈ రెండు కాకుండా అనుష్క మరో సినిమాను ఒప్పుకున్నట్లు కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఖైదీ 2. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖైదీ. ఈ సినిమాతోనే లోకేష్.. సినిమాటిక్ యూనివర్స్ ను మొదలుపెట్టాడు.


Ileana D’Cruz : ఎట్టకేలకు రెండో కొడుకుని చూపించేసిన ఇలియానా.. ఏం పేరు పెట్టారంటే?

 

LCU లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.. బెంజ్ అని మూడో సినిమా సెట్స్ మీద ఉంది. ఇక ఇప్పుడు నాలుగో సినిమా పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. లోకేష్ దర్శకత్వంలో ఖైదీ 2 మొదలుకానుందన్న విషయం తెల్సిందే. అసలు చెప్పాలంటే ఖైదీ ఒక మాస్టర్ పీస్. ఒక్కరాత్రిలో జరిగే కథను ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా.. ఒక పక్క ఉత్కంఠ.. ఇంకోపక్క తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ తో లోకేష్ తెరకెక్కించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యాడు. ఒక్క సాంగ్ కూడా లేకుండా, హీరోకు, హీరోయిన్ లేకుండాఒక సినిమా హిట్ అయ్యింది అంటే అప్పట్లో సంచలనం అని చెప్పాలి.  ఖైదీలో లోకేష్ .. సీక్వెల్ కు చాలా హింట్స్ ఇచ్చాడు. జైలుకు వచ్చింది మాత్రమే మీకు తెలుసు.. అంతకుముందు తానేం చేసాడో చెప్పలేదని ఢిల్లీ చెప్పే డైలాగ్ కానీ, తన భార్యతో సంతోషంగా ఉన్న రోజుల గురించి కానీ లోకేష్ ఏది చూపించలేదు. అంతేకాకుండా విక్రమ్ కు ఢిల్లీకి ఉన్న సంబంధం అనే ఒక చిన్న లింక్ తో ఖైదీని ఎండ్ చేశాడు.

 

ఇక ఇప్పుడు ఖైదీ 2 ఆ లైన్ తోనే తెరకెక్కించనున్నాడు. అసలు ఢిల్లీ ఎవరు.. ?అతని భార్యకు ఏమైంది.. ? ఢిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాల్సివచ్చింది.. ? రోలెక్స్ పాత్ర ఏంటి.. ? అనేది ఖైదీ 2 లో చూపించబోతున్నాడు. ఈ సీక్వెల్ లో ఢిల్లీ భార్య పాత్రకు చాలాప్రాధాన్యత  ఉండబోతుందట. అందుకే ఆ పాత్ర కోసం మంచి హీరోయిన్ ను తీసుకోవాలని సెర్చ్ చేసి చివరకు లోకేష్.. అనుష్కను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఖైదీ 2 లో అనుష్క చేస్తుందని వార్తలు వచ్చాయి కానీ, ఎలాంటి పాత్ర అనేది చెప్పలేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ భార్యగా స్వీటీ కనిపించనుంది. వారిద్దరూ ఎలా కలిశారు.. ఎలా పెళ్లి చేసుకున్నారు.. ? వారి మధ్య ప్రేమ ఇలా అన్ని అంశాలను ఇందులో చూపించబోతున్నారు. దీంతో స్వీటీకి మరో మంచి పాత్ర దొరికిందని ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో లోకేషూ.. నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో స్వీటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Mass Jathara Release :చివరికి హీరో కూడా చింటూ అనేశాడు… ఫైనల్ గా మాస్ జాతర రిలీజ్ డేట్ వచ్చేసింది

Allu Sirish engagement : రూమర్స్ నిజమే.. ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన అల్లు శిరీష్.. ఎప్పుడంటే?

Actor Ajith Kumar: వింత వ్యాధితో బాధపడుతున్న అజిత్.. సరైన నిద్ర లేదంటూ?

The Raja Saab: ట్రైలర్ ఎఫెక్ట్… రాజాసాబ్ స్పెషల్ షో చూసిన ప్రభాస్… రియాక్షన్ ఏంటంటే ?

Boyapati Sreenu: అఖండ 2 విడుదలపై బోయపాటి క్లారిటీ … కథ మొత్తం దాని చుట్టే అంటూ!

Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకి ఊరట.. వారిపై వేటు తప్పదా?

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేనేజన్ అరెస్ట్

IBomma Counter: బరాబర్ పైరసీ చేస్తాం… పోలీసులకు ఐ బొమ్మ స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

×