Fauji Delay : సీతారామం వంటి కల్ట్ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనగానే మురిసిపోయింది టాలీవుడ్.క్రేజీ కాంబోలో మరొక సాలిడ్ బ్లాక్ బాస్టర్ ఫిక్స్ అని కాలర్ ఎగరేశారు రెబల్ ఫ్యాన్స్.కానీ ఆ మురిపెం మూన్నాళ్ళు గానే అన్నట్టు ఏళ్ళు గడుస్తున్నా సినిమా అసలెప్పుడు రిలీజ్ అవుతుందో తెలీక జుట్టు పీకేసుకుంటున్న పరిస్థితి.. సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోందని సంబరపడ్డ ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తలు ఫుల్ డిసప్పాయింట్ చేస్తున్నాయ్.
80 శాతం షూటింగ్ పూర్తి.. అసలు ట్విస్ట్ ఇక్కడే
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నసంగతి తెల్సిందే. ఇక లేటెస్ట్ గా సినిమా షూటింగ్ ని హను పరుగులు పెట్టిస్తున్నాడు కూడా. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపిస్తున్నప్పటికీ, మిగిలిన 20 శాతం షూటింగ్‌లోనే సినిమా ఫ్యూచర్ ఉందన్న టాక్ ఫిలిమ్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తుంది. ఇంకా మూడు భారీ యాక్షన్ సీక్వెన్సులతో పాటు కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేయాల్సి ఉందట.అయితే, ఈ సన్నివేశాల అవుట్‌పుట్ విషయంలో డైరెక్టర్ హను కాంప్రమైజ్ కాకపోవడం వల్లే షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న దానికంటే లేట్ అవుతున్నాయని తెలుస్తుంది.
గ్రాఫిక్స్‌తోనే అసలు తలనొప్పి
ఇక సినిమా బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే అది 1940ల కాలం నాటిది. అంటే పీరియడ్ డ్రామా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పాత్ర ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు.బ్రిటిష్ కాలం నాటి సెట్టింగులు, ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధ సన్నివేశాలను వెండితెరపై న్యాచురల్ గా చూపించాలంటే భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ అవసరం కూడా.
also read :నిన్ను కోరి’ రీ-రిలీజ్ హంగామా.. పాత జ్ఞాపకాలు బయటపెట్టిన ఆది పినిశెట్టి
ఇక వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కనీసం ఏడెనిమిది నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఒకవేళ షూటింగ్ త్వరగా ముగిసినా, గ్రాఫిక్స్ పనులు లేట్ అయితే సినిమా రిలీజ్ మరింత వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రభాస్ సినిమాలు లేట్ అవుతాయనే ముద్ర ఉండగా, ఇప్పుడు ‘ఫౌజీ’ కూడా అదే బాటలో నడుస్తోందని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు
2026లో కూడా రాదా? అనుమానాల్లో ‘ఫౌజీ’
నిజానికి ఈ సినిమాను 2025 చివర్లో లేదా 2026 మొదట్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ సినిమా జరుగుతున్న ట్రెండ్ బట్టి చూస్తే 2026లో కూడా ఈ సినిమా రావడం కష్టమేనన్న ప్రచారం జోరుగా సాగుతుంది.అసలే షూటింగ్ లేట్ అవడం, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల మేకర్స్ సేఫ్ సైడ్‌గా 2027 వైపు చూస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఇదే గనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది హార్ట్ బ్రేక్ న్యూస్ అనే చెప్పాలి.సీతారామం లాంటి చిన్న సినిమా తీయడానికే హను చాలా సమయం తీసుకున్నారు. మరి 400 కోట్ల బడ్జెట్, 1940 బ్యాక్‌డ్రాప్ అంటే ఇంకెంత కాలం తిప్పుతారో?” అంటూ హను పై సోషల్ మీడియాలో ట్రోల్స్ అప్పుడే మొదలయ్యాయి కూడా
ఫస్ట్ సింగిల్‌తో సరిపెడతారా?
ఇక ఈ నెల చివర్లో విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో ఫస్ట్ సింగిల్ వస్తుందని ఊరిస్తున్నా, సినిమా విడుదలపై క్లారిటీ లేకపోవడంతో ఆ పాటపై కూడా పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. ఇమాన్వి ఇస్మాయిల్ గ్లామర్, మిథున్ చక్రవర్తి, జయప్రద లాంటి దిగ్గజాల నటన సినిమాకు ప్లస్ అవుతాయని అనుకుంటున్నా.. అవేవీ సినిమా రిలీజ్ లేట్ అవడం వల్ల కలిగే నిరాశని పూడ్చలేదని ట్రేడ్ వర్గాల అంచనా.మొత్తానికి, ‘ఫౌజీ’ చుట్టూ జరుగుతున్న ఈ రిలీజ్ డ్రామా మరో సలార్,కల్కిలని మించిన డ్రామా ని తలపిస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు రెబల్ ఫ్యాన్స్. చూడాలి చక్కర్లు కొడుతున్న ఈ రూమర్స్ పై మేకర్స్ ఎప్పుడు అప్ డేట్ వదులుతారో !
also read :వంగ మార్క్ వైలెన్స్ vs వంశీ పైడిపల్లి క్లాస్.. 2027 ఈద్ విన్నర్ ఎవరు?