E-Paper
Advertisement

ఎప్పుడు కావాలంటే అప్పుడు జోంబీగా మారే అమ్మాయి… ఇదెక్కడి విడ్డూరం భయ్యా

ఎప్పుడు కావాలంటే అప్పుడు జోంబీగా మారే అమ్మాయి… ఇదెక్కడి విడ్డూరం భయ్యా
Advertisement

Zombie Movie OTT : ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా ఉండే జాంబీ మూవీ చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మామూలుగా అయితే జాంబీ వైరస్ సోకిన వాళ్ళు రక్తం తాగే రాక్షసుల్లా మారతారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఓ అమ్మాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు జాంబీగా మారుతుంది. అలాగే కావాలనుకున్నప్పుడు మనిషిగా మారుతుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ జాంబీ థ్రిల్లర్ పేరు The Girl with All the Gifts (2016). ఈ విభిన్నమైన జోంబీ అపోకలిప్స్ సినిమాను ఎం.ఆర్. కేరీ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కించారు. మామూలు జోంబీ సినిమాల్లో కేవలం మనుషులను తినే రాక్షసులను మాత్రమే చూపిస్తారు. ఇందులో జోంబీ వైరస్ సోకిన పిల్లల ద్వారా ప్రపంచానికి కొత్త ఆశ ఎలా పుట్టిందనేది ఈ మూవీ కథ. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రక్తపాతం మామూలుగా ఉండదు. ఒక జీవజాతి అంతరించిపోయి మరొకటి ఎలా పుట్టుకొస్తుంది అనే ఫిలాసఫీని ఇందులో చూడొచ్చు. ఈ చిత్రంలో మెలానీగా నటించిన సెన్నియా నానువా నటన బాగుంటుంది. ‘The Last of Us’ వంటి స్టోరీలను ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్.

కథలోకి వెళ్తే…

Advertisement

సినిమాలో భవిష్యత్తులో ప్రపంచం అంతా ఫంగస్ (శిలీంధ్రం) వల్ల నాశనం అవుతుంది. ఈ ఫంగస్ సోకిన వారిని ‘హంగ్రీస్’ (Hungries) అంటారు. వీళ్ళు మనుషులను వేటాడి తింటారు. అయితే ఈ వైరస్ సోకిన గర్భవతులకు పుట్టిన రెండో తరం పిల్లలు మాత్రం విచిత్రంగా ఉంటారు.వాళ్ళు కూడా జోంబీలే, అయితే ఆలోచించే శక్తి, నేర్చుకునే సామర్థ్యం బాగా ఉంటాయి. అందుకే వారిని సైనిక్ బేస్‌ లో బంధించి, వారిపై పరిశోధనలు చేస్తారు. దాని ద్వారా వ్యాక్సిన్ కనిపెట్టాలని సైంటిస్టులు ట్రై చేస్తారు. ఆ పిల్లల్లో మెలానీ తెలివైనది. ఆమెకు తన టీచర్ మిస్ జస్టినో అంటే చాలా ఇష్టం.

Also Read : ఆత్మల కేసులు ఇన్వెస్టిగేట్ చేసే దెయ్యాలు… అదిరిపోయే ఫాంటసీ అడ్వంచర్ భయ్యా

Advertisement

ఈ నేపథ్యంలో ఓరోజు ఆ సైనిక బేస్‌ పై హంగ్రీస్ దాడి చేస్తారు. ఆ గందరగోళంలో మెలానీ, ఆమె టీచర్ మిస్ జస్టినో, సైంటిస్ట్ డాక్టర్ కాల్డ్‌వెల్, ఇంకొంత మంది సైనికులు అక్కడి నుండి ఎస్కేప్ అవుతారు. లండన్ ని శిథిలాల గుండా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ట్రై చేస్తారు. మెలానీ జోంబీ కావడంతో ఆమె ఇతర హంగ్రీస్ నుండి తన టీచర్‌ ను కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. కానీ ఆమె జాంబీగా ఉంటూ ఇబ్బంది పడుతుంది. లండన్‌ లో ఈ ఫంగస్ పెరిగిపోతూ ఉంటుంది. ఓ చెట్టు నుండి వచ్చే గాలి ద్వారానే మిగిలిన మనుషులు కూడా జోంబీలుగా మారే ప్రమాదం ఉంటుంది. మరి ఆ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కారు ? అనేది చూడాలి.

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×