Prabhas: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. దీని కారణం బాహుబలి సినిమా చూపించిన ఇంపాక్ట్. ఎవరు ఊహించిన రీతిలో ఆ సినిమా కోసం ఐదు సంవత్సరాలు టైం కేటాయించి విపరీతంగా కష్టపడ్డాడు ప్రభాస్. కష్టానికి తగ్గ ప్రతిఫలమే నేడు దక్కింది.
ఇక ప్రభాస్ కెరియర్ లో దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఇప్పటికే రెండు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న హీరోలు అందరికంటే కూడా ప్రభాస్ మాత్రమే స్పీడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి సినిమాలు అందిస్తున్నాడు. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా త్వరలో రీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత డిసెంబర్ 5న ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
రాజా సాబ్ సినిమాపై స్పెషల్ ఫోకస్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తాడు అని బహుశా ఎవరూ ఊహించు ఉండకపోవచ్చు. ఒక సందర్భంలో మారుతి మాట్లాడుతూ నేను ప్రభాస్ తో సినిమా చేస్తే ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బయటికి తీస్తానని చెప్పుకొచ్చాడు. విడుదలైన టీజర్ ని బట్టి మారుతి అదే చేశాడని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా పైన ప్రభాస్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.
ఏకంగా తమన్ స్టూడియో విజిట్ చేసి మ్యూజిక్ సిటింగ్స్ లో కూర్చున్నాడు. మామూలుగా తమ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విషయంలో దర్శకులు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. పాట పూర్తయిపోయిన తర్వాత హీరోలకు వినిపిస్తుంటారు. హీరోలు మ్యూజిక్ స్టూడియో కి వెళ్లిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ సినిమాకి సంబంధించి తమన్ స్టూడియో కి వెళ్లడంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని అర్థమవుతుంది.
బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాలు
ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా సెలబ్రేషన్ జరిగిపోయిన కొన్ని రోజుల తర్వాత రాజా సాబ్ థియేటర్లో విడుదల కానుంది. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టి దీని మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రభాస్ అభిమానులు మామూలు ప్రేక్షకులు ఏ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నారు వాటన్నిటిని కూడా మారుతీ చూపిస్తాడు అని అందరికీ ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే స్వతహాగా మారుతి స్ట్రెంత్ కామెడీ కాబట్టి.
Also Read: Udaipur Files Movie : 150 సెన్సార్ కట్స్… రిలీజ్‌కు రెడీ అవుతున్న మోస్ట్ కాంట్రవర్సీల్ మూవీ