Telugu Heroes : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ థియేటర్ రావడం కంప్లీట్ గా మానేశారు. ఏదో ఒక భారీ బడ్జెట్ సినిమా, పెద్ద హీరో సినిమా విడుదలయితే గాని ఆడియన్స్ థియేటర్ కు రావడం లేదు. పుష్ప, సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ వంటి సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. టెలివిజన్ లో కూడా ఈ సినిమాలు మంచి టిఆర్పి రేటింగ్స్ నమోదు చేసుకున్నాయి.
కొన్నిచోట్ల థియేటర్స్ లో ఈవినింగ్ షోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. గట్టిగా చూస్తే కనీసం 50 మంది కూడా థియేటర్లో ఉండని పరిస్థితి. ఇదే విషయాన్ని దర్శకుడు త్రినాధరావు నక్కిన కూడా ఒక సందర్భంలో చెప్పారు. వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమాకి ఆడియన్స్ ఏ రేంజ్ లో వచ్చారు అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల ఈ సినిమాకి సంబంధించిన షోస్ క్యాన్సిల్ అయిపోయాయి.
యంగ్ హీరోలు వరుస డిజాస్టర్లు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమ సొంత కష్టంతో ఎదిగిన హీరోలు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొంతమంది సినిమా ప్రేమికులు మాత్రమే థియేటర్ దగ్గరికి వెళ్తున్నారు. చిన్న చిన్న టౌన్సులో సినిమాలకు వెళ్లడం మానేశారు. ఇప్పుడు యంగ్ హీరోలు వరుస డిజాస్టర్లు ఎదుర్కొంటున్నారు. నితిన్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. లైలా సినిమాతో విశ్వక్సేన్ కూడా ఊహించిన డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. సినిమాలు డిజాస్టర్ అవుతున్న తరుణంలో వీళ్ళు రెమ్యూనరేషన్ మాత్రం పెంచుతున్నారు.
రెమ్యూనరేషన్స్ ఇవ్వొద్దు
తెలుగు హీరోలు ప్రస్తుతం హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ పెంచుతున్నారు. దీనిపైన పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా అయితే నిర్మాతలు అస్సాం చెక్కేయాల్సిన పరిస్థితి వస్తుంది. హీరోలకు రెమ్యూనరేషన్ బదులు ఏరియా వైజ్ రైట్స్ ఇస్తే వాళ్లకు గ్రౌండ్ రియాల్టీ అర్థమవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్లు ఎటువంటి బాధలు పడుతున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఇలా చేయడం బెటర్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ కు నో షో బోర్డ్స్ పెడుతున్నారు కదా.. అలా.. నిర్మాతలు తమ ఆఫీస్ ల ముందు నో రెమ్యునరేషన్ అనే బోర్డు పెట్టే రోజులు రావాలి. ఏదేమైనా మలయాళం సినిమాలు మాత్రం తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించి కొంతమేరకు కలెక్షన్స్ రాబడుతున్నాయి. వీటి గురించి కొంతమంది నిర్మాతలు, హీరోలు కలిసి ఎటువంటి నిర్ణయం తీసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తారో ఎదురు చూడాలి.
Also Read: Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. రన్ టైమ్ లాక్ చేసిన మేకర్స్..పైగా ఐపీఎల్ తో సమానం అంటూ!