BigTV English

Covid Vaccine: 40 రోజుల్లో 23 మరణాలు, కోవిడ్ వ్యాక్సిన్ వల్లే వారికి గుండెపోటు వచ్చిందా?

Covid Vaccine: 40 రోజుల్లో 23 మరణాలు, కోవిడ్ వ్యాక్సిన్ వల్లే వారికి గుండెపోటు వచ్చిందా?

కోవిడ్ 19 వైరస్ వచ్చాక ప్రపంచం స్థితిగతులు చాలా మారాయి. కోవిడ్ 19 వ్యాక్సిన్ దాదాపు అందరూ వేసుకున్నారు. అయితే కోవిడ్ 19 టీకా తీసుకున్న వారిలో గుండెపోటు సమస్యలు అధికంగా వస్తున్నట్టు ఒక వాదన తెరమీదకి వచ్చింది. తాజాగా కర్ణాటకలోని హసన్ జిల్లాల్లో 40 రోజుల్లో గుండెపోటు కారణంగా 23 మంది యువకులు మరణించినట్టు తెలిసింది.


యువతలో గుండెపోటు రావడం సాధారణ విషయం కాదు. నిజానికి వృద్ధులలోనే గుండెపోటు అధికంగా వస్తుంది. అలాంటిది యువతలో అది కూడా 40 రోజుల్లో ఇంతమందికి రావడం ఏమిటనే అనుమానం అధికమయ్యింది.

కోవిడ్ వ్యాక్సిన్ కారణంగానేనా?
వారికి వచ్చిన గుండెపోటుకు కోవిడ్ 19 వ్యాక్సిన్ కి సంబంధం ఉందని అనుమానం కూడా వచ్చింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రక్తం గట్టిపడే సమస్య వస్తున్నట్లు వాదన ఉంది. అందుకే టీకాలు వేసిన వేసుకున్న వారిలో స్ట్రోక్ కు, గుండెపోటు ప్రమాదం ఇతరుల కంటే ఎక్కువగా ఉందనే భయం కూడా ప్రజల్లో పెరిగింది. అయితే ఈ భయాలపై ఆరోగ్య శాఖ, దేశంలోని ప్రముఖ ఆరోగ్య సంస్థలైన ఎయిమ్స్, ఐసిఎంఆర్ వంటి ఆరోగ్య కేంద్రాలు ఏం చెప్పాయో తెలుసుకోండి.


ఆకస్మిక మరణాలపై ఐసిఎంఆర్, ఎయిమ్స్ సంస్థలు లోతైన దర్యాప్తు నిర్వహించాయి. ఈ అధ్యయనాల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ కు, గుండెపోటుకు మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని తేలింది. 250 కేసులను వారు విశ్లేషించాకే నిర్ణయానికి వచ్చారు. అయితే కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వల్ల గుండె ప్రభావితం అయ్యే ప్రమాదం మాత్రం ఎక్కువగానే ఉంది.

కోవిడ్ వైరస్ వల్లే ప్రమాదం
కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వల్ల గుండె బలహీన పడుతుంది. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. అయితే కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ దుష్ప్రభావాలు తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వస్తే టీకా తీసుకున్న లేదా తీసుకోకపోయినా కూడా గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. అంటే మీకు గతంలో కోవిడ్ వచ్చి తగ్గితే… గుండె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నది వైద్యులు చెబుతున్న సలహా.

గుండెపోటు ఎందుకు?
ఇక యువతలో గుండె జబ్బులు పెరిగిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని వివరిస్తున్నారు. వైద్యులు ముఖ్యంగా చెడు జీవనశైలి కారణంగానే ఇలా జరుగుతోందని చెబుతున్నారు. అధిక ఒత్తిడి కలిగిన ఉద్యోగాలు, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ చేయకపోవడం, ధూమపానం, విపరీతమైన గాలి కాలుష్యం వంటివన్నీ కూడా గుండెను బలహీన పరుస్తున్నాయి. ముఖ్యంగా గుండె దమనులలో అడ్డంకులు పేరుకుపోవడానికి కారణం అవుతున్నాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు పెంచేస్తోంది.

కాబట్టి కోవిడ్ 19 టీకాకు, గుండెపోటు రావడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ ఒకప్పుడు తీవ్రంగా కోవిడ్ ఇన్ఫెక్షన్‌కు గురైతే మాత్రం భవిష్యత్తులో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కొంతమేరకు ఉంటాయి. కాబట్టి గుండె కోసం ప్రత్యేక జాగ్రత్తలు, ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Related News

Stress And Heart attack: స్ట్రెస్ ఎక్కువైతే.. హర్ట్ ఎటాక్ వస్తుందా ?

Health Benefits: ఈ ఒక్క చపాతీ తింటే చాటు.. ఆ సమస్యలన్నీ మాయం

Magnesium Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? జాగ్రత్త

Healthy Looking Skin: ఆరోగ్యవంతమైన చర్మం కోసం.. ఎలాంటి చిట్కాలు పాటించాలి ?

Sleep: తగినంత నిద్ర ఎందుకు ముఖ్యమంటే ?

Drink For Hair Fall: ఈ డ్రింక్స్‌తో.. హెయిర్ ఫాల్‌కు చెక్

Big Stories

×