Tollywood Actress: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఒకరు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ తన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ప్రభాస్ సినీ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఇతరులకు ఎంతో మంచి గౌరవ, మర్యాదలను ఇస్తారు. అలాగే వారికి కడుపునిండా భోజనం పెట్టి ఆకలి తీరుస్తూ ఉంటారు. ఇలా ప్రభాస్ గొప్పతనం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు పలు సందర్భాలలో తెలియచేశారు.
సినిమాలు అంటే ఇష్టం లేదా?
ఇకపోతే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ గురించి చేసిన ఆరోపణలు సంచలనగా మారాయి. ప్రభాస్ కారణంగా తాను నరకం అనుభవించానని, ప్రతిరోజు ఏడ్చేదాన్ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఏ హీరోయిన్ ప్రభాస్ కారణంగా అంతలా బాధ పడింది? అసలేం జరిగింది? విషయానికి వస్తే… టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నిత్యమీనన్ (Nithya Memon)ఒకరు. అలా మొదలైంది(Ala Modalyndi) సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఈమె ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ప్రభాస్ ఎవరోతెలియదు?
అలా మొదలైంది సినిమా నిత్యమీనన్ కు మొదటి సినిమా, అప్పటివరకు సినిమా ఇండస్ట్రీ అంటే కూడా ఏంటో తెలియని ఈమెకు నందిని రెడ్డి అవకాశం కల్పించి బలవంతంగా ఈ సినిమాలో నటించేలా చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ మీకు తెలుసా అంటూ ప్రశ్నలు ఎదురవడంతో ఈమె నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని సమాధానం ఇచ్చారు. ఇలా ప్రభాస్ ఎవరో తెలియదని ఈమె సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతూ ఈమెపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ చూసి ప్రతిరోజు ఏడ్చేదాన్ని, ఆ కొద్ది రోజులు నరకం అనుభవించాను అంటూ తన బాధను బయట పెట్టారు.
నేషనల్ అవార్డు విన్నర్…
ఇలా ప్రభాస్ తెలియదు అన్నందుకే నా చేత అభిమానులు నరకం స్పెల్లింగ్ రాయించారు. అందుకే ప్రతి ఒక్క విషయంలోనూ నిజాయితీగా ఉండకూడదని ఆరోజే డిసైడ్ అయ్యా అంటూ నిత్యమీనన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నిత్యమీనన్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం తమిళ్, మలయాళం, తెలుగు భాషలలో సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈమె నటించిన తిరుచిత్రంబళం సినిమాలో తన నటనకు గాను జాతీయ అవార్డు లభించిన విషయం తెలిసిందే.
ఇక ఈమె నాలుగు ఫిలింఫేర్ అవార్డులతో పాటు రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
Also Read: జీవితంలో ఆ కోరిక తీరదు… కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రేరణ?