LIK and Dude Movies Releasing Dates: ప్రదీప్ రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లవ్‌టుడే సినిమాతో తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ప్రేమకథ చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథనే దర్వకత్వం వహించడం విశేషం.
లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాలతో ఫుల్ క్రేజ్
దీంతో ఆయనకు తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. నిజానికి అతడు కోమలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. యూత్‌ని టార్గెట్ చేస్తూ.. యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్ రంగనాథన్ చిత్రాలు మంచి బజ్ నెలకొంది. ఇటీవల డ్రాగన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన అతడు ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి LIK (Love Insurance Kompany) మరోకటి డ్యూడ్ మూవీ. ఈ ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటున్నాయి.
సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం..
తాజాగా ఈ సినిమాలకు సంబంధించిన టీజర్ రిలీజ్‌పై అప్డేట్స్ వచ్చాయి. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈరెండు సినిమాలు కూడా ఒకే రిలీజ్ విడుదల కాబోతున్నాయి. ఒకే హీరో సినిమాలు, ఒకే రోజు విడుదల కావడం ఇదే మొదటి సారి. ఎల్‌ఐకే, డ్యూడ్ సినిమా రెండు సినిమాలు అక్టోబర్ 17న విడుదల అవుతున్నాయి. రెండు సినిమాలు కూడా వేరు వేరు ప్రొడక్షన్ హౌజ్‌లో రూపొందాయి. ఒకే హీరో సినిమాలు.. రెండు వేరు వేరు ప్రొడక్షన్ నుంచి ఒకే రోజు థియేటర్లలో పోటీ పడటం సినిమా చరిత్రలోనే మొదటిసారి. ఇప్పటికే యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్‌కి.. ఈ రెండు సినిమాల రిలీజ్‌లో ఫుల్ బజ్ పెంచుకున్నాడు.
Also Read: MEGA 158 Movie : అదే పాత టెంప్లేట్… బాలయ్య మూవీనే చిరు కోసం కాపీ కొడుతున్నాడా?
మరి అనుకున్న తేదీకే రెండు సినిమాలు రిలీజ్ అవుతాయా? లేక ఏదైన సినిమా వాయిదా పడుతుందా? తెలియాలి. కాగా ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించి ఎల్‌ఐకే చిత్రాన్ని నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగష్టు 29న ఈ మూవీ గ్లింప్స్ విడుదల కానుంది. ఇక కీర్తిశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డ్యూడ్ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, వై. రవిశకంర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
For the first time, two production houses are set to clash, featuring #PradeepRanganathan as the hero in both films.#LIK – Oct 17th Release (First update on Aug 27th)#Dude – Oct 17th Release (First update on Aug 22nd Today) pic.twitter.com/iX6kNjuvqM
— Movies4u Official (@Movies4u_Officl) August 22, 2025