Chiru Odela Movie : సినిమా చేయాలి అని ఆశతో కొంతమంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు. అదేవిధంగా సినిమా చేయాలి అనే పిచ్చి పరాకాష్టకు చేరడంతో ఇంకొంతమంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇస్తారు. అటువంటి దర్శకుడు జాబితాలోకి చేరుతాడు శ్రీకాంత్ ఓదెల. నాని నటించిన దసరా సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్.
నానిని మునుపెన్నడూ చూడని విధంగా చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాడు. మొదటి సినిమా దర్శకుడుగా అంటే ఎవరు నమ్మశక్యం కాని విధంగా సినిమాను తెరకెక్కించాడు. నాని కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా దసరా. ఇప్పుడు మరోసారి పారడైజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు.
మెగాస్టార్ జీవితకాలం ఆడే సినిమా
మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువవుతుంది. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ దర్శకులు అంతా కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానులే. అయితే శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు.
నువ్వు నా డెమి గాడ్, చిరంజీవితో ఫోటో దిగి ఇంట్లో అమ్మకు చూపెడితే.. ఫస్ట్ టైం నువ్వు ఫోటోలో నవ్వడం చూస్తున్నారా అని చెప్పింది. అది నా డెఫినిషన్ చిరంజీవి అంటే.
ఏం చేస్తాడు నీ చిరంజీవి అంటే…
నాలాంటి ఇంట్రో వర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు, సినిమా టికెట్లు కొనుక్కున్న వాడితో సినిమా తీయించగలడు.
నీ అమ్మ – జీవిత కాలం ఆడే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నేను మిస్ అవుతున్న చిరంజీవి ఆల్ స్క్రీన్ పైన చూపిస్తాను. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఆ చిరంజీవిని నేను వెనక్కి తీసుకొస్తాను. నాకోసం నేనే తీస్తున్న సినిమా ఇది. నాలాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం తీస్తున్న సినిమా చిరు ఓదెల.
అంటూ మెగాస్టార్ చిరంజీవి పైన ప్రేమను కురిపించాడు.
https://Twitter.com/odela_srikanth/status/1958874688505225467?t=DNgcYLdNXvdnCRFJvR5aNw&s=19
మొత్తానికి శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన ఎలివేషన్ బీభత్సంగా ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ ఓదెల మీద ఇప్పటికే విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. మళ్లీ ఈ పోస్ట్ చూస్తుంటే ఒక కొత్త సినిమా అప్డేట్ వచ్చినంత ఫీలింగ్ కలిగింది అని చెప్పాలి. మొత్తానికి శ్రీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే ఇప్పుడు శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. జీవితాంతం గుర్తుండిపోయే సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.
Also Read: Mega158 : పోస్టర్ లోనే విధ్వంసం, భారీ యాక్షన్ ప్లాన్ చేసిన బాబీ