BigTV English

MEGA 158 Movie : అదే పాత టెంప్లేట్… బాలయ్య మూవీనే చిరు కోసం కాపీ కొడుతున్నాడా?

MEGA 158 Movie : అదే పాత టెంప్లేట్… బాలయ్య మూవీనే చిరు కోసం కాపీ కొడుతున్నాడా?

MEGA 158 Movie: రీఎంట్రీ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల లైనప్‌ మామూలుగా లేదు. ఒక మూవీ సెట్‌లో ఉండగానే.. మరో సినిమాని లైన్‌లో పెడుతున్నాడు. అది కూడా యంగ్‌ డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేస్తున్నారు. వరుసగా యంగ్‌ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టి యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వశిష్ఠతో ‘విశ్వంభర’, అనిల్‌ రావిపూడితో ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాలు షూటింగ్స్‌ని జరుపుకున్నారు. మరోవైపు దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెలతో ఓ యాక్షన్‌ డ్రామా చేస్తున్నారు. తాజాగా మరో యంగ్‌ డైరెక్టర్‌ బాబీతో ఓ సినిమాకు కమిట్‌ అయ్యారు.


మెగా 158 కాన్సెప్ట్ పోస్టర్

ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ఆఫీషియల్‌గా ప్రకటన ఇచ్చారు.  మెగా158 (Mega 158) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను కాసేపటి క్రితం ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ కాన్సెప్ట్ పోస్టర్ (Mega 158 Concept Poster) ఆకట్టుకుంటోంది. గొడ్డలితో ఉన్న పోస్టర్‌ని రిలీజ్ చేశారు. గోడకు గొడ్డలి పోటుతో పాటు తుపాకి గుండ్ల దెబ్బలు ఉన్న ఈ పోస్టర్‌ ఆసక్తిని పెంచుతుంది. ‘ది బ్లేడ్‌ దట్‌ సెట్‌ ది బ్లేడి బెంచ్‌మార్క్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. పోస్టర్‌ చూస్తుంటే యాక్షన్‌ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే చిరు-బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ మంచి విజయం సాధించింది. 2023లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది.


దీంతో వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. దీంతో ప్రకటనతోనే మూవీపై హైప్ క్రియేట్‌ అయ్యింది. దీంతో మెగా 158 ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే అప్పుడే ఈ పోస్టర్‌పై యాంటి ఫ్యాన్స్‌ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ పోప్టర్‌ బాలయ్య మూవీకి కాపీలా ఉందంటూ సెటైర్స్‌ వేస్తున్నారు. డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఇటీవల తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్‌.2024 విడుదలైన ఈ సినిమా బాలయ్య 109వ చిత్రంగా తెరకెక్కి ఈ చిత్రం భారీ విజయం సాధించింది. అయితే ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌కి కూడా బాబీ గోడ్డలి పోస్టర్‌నే ఉపయోగించారు. గోడ్డలికి కళ్లజోడు పెట్టి, ఒక బ్రేస్‌లెట్‌ యాడ్‌ చేశారు. గొడ్డలి పోస్టర్‌తోనే బాలయ్య సినిమాను ప్రకటించారు.

Also Read: Mana Shankara Vara pPrasad Garu : మన శంకర వరప్రసాద్ ఒక్కరు కాదు ఇద్దరు… మూవీ ఫుల్ స్టోరీ ఇదే ?

బాలయ్య సినిమాకు కాపీనా?

ఇప్పుడు చిరంజీవి సినిమాకి కూడా అచ్చం అలాంటి పోస్టర్‌నే ఉపయోగించాడు. దీంతో బాబీ ఆదిలోనే చిరు సినిమాను కాపీ కొట్టారంటూ యాంటీ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. ఏంటీ బాబీ ఇది.. కాస్తా చూసకోవచ్చు కదా. కొత్త సినిమాకి కూడా అదే పాత టెంప్లేటా! అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు ఈ రెండు పోస్టర్స్‌ని కంపేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. రెండు పోస్టర్స్‌ ఒకేలా ఉండటంతో.. ఇలాంటి గొడ్డళ్లు బాలయ్యకు సెట్‌ అవతాయి.. చిరుకి పెద్దగా కనెక్ట్‌ అవ్వకపోవచ్చు నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా Mega 158 పో స్టర్‌లో గొడ్డలిపై బెంగాలి ‘విధ్వంసం వస్తోంది’ అని కోట్‌ రాసి ఉంది. ఈ కోట్‌ సినిమాను బాబీ యాక్షన్‌, డ్రామా ప్లాన్‌ చేశాడని అర్థమైపోతుంది. ఇందులో చిరు రోల్‌ని బాబీ ఎలా డిజైన్ చేసుండాలని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.

Related News

Pradeep Ranganathan: సినీ చరిత్రలోనే ఫస్ట్‌టైం.. ఒకే హీరో.. ఒకే రోజు.. రెండు సినిమాలు రిలీజ్!

Chiru Odela Movie : జీవితకాలం ఆడే సినిమా చిరంజీవి… ఏం ఎలివేషన్ ఇచ్చావ్ అయ్యా

Mega158 : పోస్టర్ లోనే విధ్వంసం, భారీ యాక్షన్ ప్లాన్ చేసిన బాబీ

Panjabi Industry : పంజాబీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..

Hero Dharma Mahesh Wife : గర్భవతిగా ఉన్నప్పుడే నన్ను చంపాలని చూశాడు.. హీరోపై భార్య సంచలన కామెంట్స్..

Big Stories

×