E-Paper
Advertisement

Tamil Directors: పాన్ ఇండియా క్రేజ్ కోసం తమిళ సినిమాను పక్కన పెడుతున్న దర్శకులు..!

Tamil Directors: పాన్ ఇండియా క్రేజ్ కోసం తమిళ సినిమాను పక్కన పెడుతున్న దర్శకులు..!
Advertisement

Tamil Directors: పాన్ ఇండియా పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి తమిళ ఇండస్ట్రీకి మంచి గుర్తింపు ఉంది.. అయితే ఇటీవలి కాలంలో కొన్ని పరిణామలు అభిమానుల్లో పెద్ద చర్చలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా హీరో అల్లు అర్జున్తో కలిసి చేయబోయే AA23 సినిమా ప్రకటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అభిమానుల మధ్య వాదనలు.. అభిప్రాయాలు వెల్లువెత్తాయి.

 

Advertisement

అల్లు అర్జున్ అభిమానులు ఈ కాంబినేషన్‌పై ఆనందం వ్యక్తం చేస్తుంటే, కొంతమంది కోలీవుడ్ అభిమానులు మాత్రం లోకేష్‌పై అసంతృప్తి చూపిస్తున్నారు. తమిళ సినిమాను పక్కన పెట్టి డబ్బు, పేరు కోసం ఇతర పరిశ్రమల వైపు వెళ్లారని ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కైతి 2..రోలెక్స్ వంటి సినిమాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాల్సిందని వారు అంటున్నారు.

 

తమిళ డైరెక్టర్ల తిప్పలు..

Advertisement

 

ఈ విమర్శలు ఒక్క లోకేష్‌కే పరిమితం కావడం లేదు. దర్శకులు ఆట్లీ.. నెల్సన్ దిలీప్‌కుమార్ కూడా తమిళ పరిశ్రమను వదిలి ఇతర భాషలపై దృష్టి పెట్టారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళ ప్రేక్షకుల మద్దతుతో ఎదిగిన దర్శకులు పీక్ టైంలో ఇలా బయటకు వెళ్లడం సరైంది కాదని భావిస్తున్నారు.

 

ఇదే సమయంలో నెల్సన్ త్వరలో హీరో ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన లేకపోయినా, జైలర్ 2 తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయనే టాక్ ఉంది.

 

ఈ దర్శకులను చాలా మంది దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో పోలుస్తున్నారు. రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసిస్తున్నారు.

 

స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్..

 

లోకేష్–అల్లు అర్జున్ కాంబినేషన్ తమిళ సినీ అభిమానుల్లో పెద్ద చర్చకు కారణమైంది. ప్రముఖ దర్శకులు ఇతర పరిశ్రమల వైపు వెళ్లడంతో, తమిళ సినిమాకు కొత్త దర్శకుల అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Also Read: Allu Arjun: జపాన్ ప్రీమియర్‌లో అల్లు అర్జున్ మాస్ మోమెంట్… జపనీస్ డైలాగ్ హైలైట్

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×