E-Paper
Advertisement

ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. రెండు రోజుల్లో మీడియా ముందుకు ..అసలు కథ ఏంటంటే?

ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. రెండు రోజుల్లో మీడియా ముందుకు ..అసలు కథ ఏంటంటే?
Advertisement

Prakash Raj: ప్రకాష్ రాజ్… కాంట్రవర్సీలకి కేరాఫ్ గా మారుతున్న ఈ వెర్సటైల్ యాక్టర్ మరోసారి మీడియాలో హైలెట్ అయ్యాడు.విషయంలోకి వెళ్తే..కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా జరిగినట్టు చెప్తున్న సామూహిక ఖననాల వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నరమేధం వెనుక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఈ సీనియర్ నటుడు, నిజ జీవితంలోనూ సామాజిక అంశాలపై గట్టిగా గళమెత్తుతుంటారు. గతంలో ‘కాంచీవరం’ వంటి జాతీయ అవార్డు చిత్రాల్లోనే కాకుండా ‘సింగం’, ‘పోకిరి’ వంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్లలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సాటిలేని నటనను కనబరిచిన ప్రకాష్ రాజ్ పేరు ఇప్పుడు ఈ భయానక కేసులోకి లాగబడటం గమనార్హం.

Advertisement

also read :రామ్ చరణ్ ‘పెద్ది’ 500 కోట్ల మార్కును అందుకోవడం కష్టమేనా?

నువ్వు దేనికీ భయపడకు నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాను

ఈ వివాదానికి అసలు మూలకారణం ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి జూన్ 11న కర్ణాటక హైకోర్టులో కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. కొందరు వ్యక్తుల ఒత్తిడి, ప్రలోభాల వల్లే తాను గతంలో స్టేట్‌మెంట్లు ఇవ్వాల్సి వచ్చిందని చెప్తూ.. నటుడు ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని ఆరోపించాడు. “నువ్వు దేనికీ భయపడకు, జూలై 29న నేను స్వయంగా వచ్చి నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాను” అంటూ తనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారనే విషయాన్ని చిన్నయ్య ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. జూలై 29న ప్రకాష్ రాజ్ కలుస్తానని హామీ ఇచ్చారంటూ నిందితుడు చెప్పిన తేదీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

మరో రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తానన్న ప్రకాష్ రాజ్ 

తనపై వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న నెగెటివ్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ ప్రకాష్ రాజ్ కన్నడ భాషలో ఒక సుదీర్ఘమైన ట్వీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. ధర్మస్థల కేసుకు సంబంధించి మీడియాలోనూ, సోషల్ నెట్‌వర్కులలోనూ తనపై వస్తున్న కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇది అత్యంత సున్నితమైన విషయం కావడం, అలాగే లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని నొప్పించేది కావడంతో ఇలాంటి అనుమానాలపై స్పందించడం ఒక బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను ప్రస్తుతం చాలా దూరంగా ఉన్నానని, మరో రెండు రోజుల్లో స్వయంగా వచ్చి మీడియా మిత్రుల ద్వారా దీనిపై పూర్తి స్పష్టత ఇస్తానని, అంతవరకు ఆ గాలి వార్తలను నమ్మకండి అంటూ నెటిజన్లను కోరారు. కొందరు దుర్మార్గులు ఉన్నవి లేనట్టుగా,లేనివి ఉన్నట్టుగా  ప్రచారం చేస్తారని,వాటిని అస్సలు నమ్మవద్దని కోరాడు.

మీడియా ముందు ఎలాంటి నిజాలను వెల్లడిస్తారో

ఈ కేసు విషయానికి వస్తే ..1995 నుండి 2014 మధ్య కాలంలో అత్యాచారాలు, దారుణ హత్యలకు గురైన వందలాది మంది మహిళలు, స్కూల్ పిల్లల శవాలను బలవంతంగా పూడ్చిపెట్టేలా తనను అప్పటి యాజమాన్యం వేధించిందంటూ ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT), ఆ కార్మికుడు చూపెట్టిన అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా పలు అస్థిపంజరాలు బయటపడ్డాయి. అయితే స్థానిక పంచాయతీ అధికారులు మాత్రం అవి గుర్తుతెలియని అనాథ శవాలని వాదిస్తున్నారు.

also read :మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇసుకలో పాతిపెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్!

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఇలాంటి కీలక సమయంలో, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ఒక సున్నితమైన కేసులో ఆయన పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. మరి మరో రెండు రోజుల్లో ప్రకాష్ రాజ్ స్వయంగా వచ్చి మీడియా ముందు ఎలాంటి నిజాలను వెల్లడిస్తారో చూడాలి.

Related News

Big Breaking : దగ్గుబాటి బ్రదర్స్ కి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్ట్ తప్పదా..?

సైమాలో ‘మిరాయ్’ మోత.. 11 నామినేషన్స్‌తో రికార్డ్!

రణ్‌బీర్‌కు క్లాస్ తీసుకున్న మహాభారత్ శ్రీకృష్ణుడు.. కారణం ఇదే!

6 వేల పాటలు పాడిన గాయని.. కె. జమునారాణి కన్నుమూత

ఎట్టకేలకు కొట్టేశాడు.. అఖిల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల సినిమా..!

జగపతిబాబు మొహానికి సర్జరీ..? అసలు ఏమైంది..!

నడుమొంపులతో యువతలో గిలిగింతలు పెడుతున్న మానస వారణాసి!

నన్నూ కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ కంటే అక్కడే ఎక్కువ..రహస్యాలు బయటపెట్టిన ఆమని!

Big Stories

Advertisement
×