E-Paper
Advertisement

నన్నూ కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ కంటే అక్కడే ఎక్కువ..రహస్యాలు బయటపెట్టిన ఆమని!

నన్నూ కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ కంటే అక్కడే ఎక్కువ..రహస్యాలు బయటపెట్టిన ఆమని!
Advertisement

Actress Aamani: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశం రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే కామెంట్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అందులో కొంతమంది కమిట్మెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరికొంతమంది కమిట్మెంట్ కి ఒప్పుకోక పదుల సంఖ్యలో ఆఫర్లు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ విషయాలను వాళ్లే స్వయంగా చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది సీనియర్ హీరోయిన్లు కూడా అవకాశం రావాలి అంటే, కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే రేంజ్ లో అప్పట్లో కామెంట్లు చేసి సంచలనం కూడా సృష్టించారు. ఈ క్రమంలోనే తనకి కూడా కమిట్మెంట్ ఇబ్బందులు ఎదురయ్యాయని, దీనివల్ల ఏకంగా 60 నుంచి 70 చిత్రాలలో అవకాశాలు కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమని.

నన్నూ కమిట్మెంట్ అడిగారు – ఆమని

పదహారణాల పడుచందం తెలుగు అమ్మాయి ఆమని (Aamani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు , తమిళ్ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. దివంగత దర్శకులు ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబలకడిపంబ’ సినిమాలో వీ.కే.నరేష్ (VK Naresh) సరసన హీరోయిన్గా తొలి అవకాశం అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో బాపూ దర్శకత్వంలో మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించి ఆకట్టుకుంది. పైగా ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఉత్తమ నటిగా ఆమనికి నంది అవార్డు లభించింది. అలా ఒక్కటేమిటి పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకి కూడా కమిట్మెంట్ ఇబ్బందులు ఎదురయ్యాయి అంటూ తెలిపింది.

కమిట్మెంట్ వల్ల ఏకంగా 70 సినిమాలలో ఛాన్స్ కోల్పోయా – ఆమని

Advertisement

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమనీకి..” ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే కమిట్మెంట్ కచ్చితంగా ఇవ్వాల్సిందేనట నిజమేనా?” అనే ప్రశ్న ఎదురవగా.. ఆమె మాట్లాడుతూ..” కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అనేంత రూల్ ఏమీ లేదు”.. అని తెలిపింది. మరి మిమ్మల్ని ఎవరు అడగలేదా? అని అడిగితే..” ఎందుకు నన్ను కూడా చాలామంది కమిట్మెంట్ అడిగారు. అయితే మా అమ్మ పంపించేది కాదు. చాలామంది ఒక సినిమాలో అవకాశం ఓకే అయిన తర్వాత గెస్ట్ హౌస్ కి రమ్మని పిలిచేవారు. మా అమ్మను తీసుకొని వస్తాను అంటే అమ్మ అక్కర్లేదు.. నువ్వు ఒక్కదానివే వస్తే చాలు అని చెప్పేవాళ్ళు. కానీ మా అమ్మ పంపించేది కాదు. ఒక సినిమాలో అవకాశం ఇచ్చి ఓకే అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక కారు పంపించి.. నువ్వు మాత్రమే రావాలి.. ప్రొడ్యూసర్ సార్ పిలుస్తున్నారు. అని మేనేజర్ ఫోన్ చేసే వాళ్ళు. అక్కడ ఎవరు ఎక్కువ హైక్ ఉంటే వాళ్ళు పిలిచేవాళ్ళు. ఈ ఒక్క కారణంగా 60 నుండి 70 వరకు ఆడిషన్స్ ఫెయిల్ అయ్యాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమని. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read: గోల్డ్ స్కామ్‌లో ఇరుక్కున్న ‘లఫూట్ గ్యాంగ్’ నిర్మాత, ఏం చేశాడంటే?

టాలీవుడ్ లో కంటే అక్కడే ఎక్కువ..

Advertisement

ఇండస్ట్రీలో అందరూ అలాగే అని నేను చెప్పట్లేదు. కానీ ఒక 70% అలాగే ఉన్నారు. టాలీవుడ్ కంటే తమిళ్లోనే ఈ కమిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది అంటూ హాట్ బాంబు పేల్చింది ఆమని.

Related News

నడుమొంపులతో యువతలో గిలిగింతలు పెడుతున్న మానస వారణాసి!

“మై బ్రదర్” అంటూ దుల్కర్‌పై ప్రేమ కురిపించిన ఎన్టీఆర్..!

స్టార్ హీరోయిన్‌కే టోకరా.. క్రెడిట్ కార్డు నుంచి రూ.2.43 లక్షలు స్వాహా..!

గోల్డ్ స్కామ్‌లో ఇరుక్కున్న ‘లఫూట్ గ్యాంగ్’ నిర్మాత, ఏం చేశాడంటే?

‘సత్య’ తర్వాత నాతో షారుఖ్ అన్నది ఇదే…ఇన్నాళ్లకు నోరు విప్పిన జేడీ..!

మరో ఖరీదైన ఇల్లు కొన్న విరుష్క…ధర వింటే కళ్లు తిరగాల్సిందే..!

వరుణ్ తేజ్ మంచి మనసు.. ట్యూమర్ చికిత్సకి అయ్యే పూర్తి ఖర్చు తనదే అంటూ!

Big Stories

Advertisement
×