Manasa Varanasi :మాజీ మిస్ ఇండియా, తెలుగు అందం మానస వారణాసి సోషల్ మీడియాలో తనదైన ఫ్యాషన్ విజువల్స్‌తో తెగ సందడి చేస్తోంది. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ, తాజాగా షేర్ చేసిన శారీ ఫోటోషూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంప్రదాయ చీరకట్టులో ఆధునిక మోడలింగ్ శైలిని మిళితం చేస్తూ ఆమె ఇచ్చిన పోజులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్‌ను అలరించే మానస, తాజాగా ‘బి కమింగ్’ అనే చిన్న ట్యాగ్‌తో కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది.

ఇక సొరా బై స్వప్న డిజైన్ చేసిన ఈ చీరకట్టులో మానస ఎంతో ప్రశాంతంగా, క్లాసిక్ లుక్‌లో మెరిసిపోయింది. వేకువఝాము వెలుగుల్లో ప్రకృతి అందాల నడుమ తీసిన ఈ ఫొటోలు ఒక కళాత్మక రూపంలా కనిపిస్తూ మైమరిపిస్తున్నాయి.

ఈ ఫోటోషూట్ కోసం మానస లైట్ గ్రీన్ సేజ్ కలర్ ఆర్గాంజా చీరను ఎంచుకుంది. చేతితో వేసిన పూల డిజైన్లు, త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆ చీరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక దానికి జోడీగా స్లీవ్‌లెస్ లావెండర్-గ్రే బ్లౌజ్‌ను ధరించి, ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, చేతికి మెటాలిక్ బ్రాస్‌లెట్‌తో మెరిసిపోయింది. సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్‌లో ఆమె సౌందర్యం మరింతగా ఒలికిపోతోంది.

మానస కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటిగా కూడా మంచి మార్కులు కొట్టేస్తోంది. ‘దేవకీ నందన వాసుదేవ’, ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఈ తెలుగమ్మాయి, ‘కపుల్ ఫ్రెండ్లీ’తో మంచి విజయాన్ని అందుకుంది.

ఇక మాజీ మిస్ ఇండియాగా గుర్తింపు పొందిన మానస, తన ఎంపికలతో టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్ ఉన్న నటిగా ఎదుగుతోంది.