E-Paper
Advertisement

జన సైనికులా? గూండాలా? ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మండిపడ్డ ప్రకాష్ రాజ్!

జన సైనికులా? గూండాలా? ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మండిపడ్డ ప్రకాష్ రాజ్!
Advertisement

Prakash Raj:దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో స్పీచ్ ఇచ్చిన ప్రముఖ జర్నలిస్టు ప్రశ్న రావణ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లను ఉద్దేశిస్తూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ బూతులతో చెలరేగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో హైదరాబాదులో ప్రశ్న రావణ్ ను అరెస్టు చేసి, అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చారు పోలీసులు. ఇక దీంతో మండిపడ్డ ప్రకాష్ రాజ్.. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికే విగాథం.. పిరికితనం.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పై ట్విట్టర్ వేదికగా వీడియో రిలీజ్ చేస్తూ మరి మండిపడ్డారు.

ప్రశ్నిస్తే చంపేస్తారా – ప్రకాష్ రాజ్

ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. ప్రశ్న రావణ్ ను అరెస్టు చేసి కోర్టుకి హాజరు పరిచినప్పుడు.. ఇలాంటి కేసులను పరిగణలోకి తీసుకోలేమని కోర్టు బెయిల్ ఇవ్వగా.. మరో కేసు పెట్టి ప్రశ్న రావణ్ ను అరెస్టు చేయడంపై నిన్న అర్ధరాత్రి మరో వీడియోతో ముందుకొచ్చిన ప్రకాష్ రాజ్ జనాలు చూస్తున్నారు.. ఎందుకు ఇలాంటి సిగ్గులేని కక్ష సాధింపులు.. ఇప్పటికైనా మారండి.. మీ దగ్గర ప్రశ్న రావణ్ ను జైలు పాలు చేయడానికి 30 కేసులు ఉన్నాయంట కదా అంటూ తనదైన శైలిలో మండిపడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చి జన సైనికులా? లేక గుండాలా?అంటూ జన సైనికుల తీరుపై మండిపడ్డారు ప్రకాష్ రాజ్.

Advertisement

also read:ఘనంగా జీబీటీ సీజన్-3 కర్టెన్ రైజర్.. మెగా ఈవెంట్ ఎప్పుడంటే?

జన సైనికులా? గూండాలా ?

ఈ మేరకు ప్రశ్న రావణ్ విషయంలో జనసైనికుల ఓవరాక్షన్ పై మరొక వీడియోని రిలీజ్ చేస్తూ ఫైరయ్యారు. జనసైనికులు బాగా రెచ్చిపోతున్నారు. జనసైనికులా లేక గుండాలా? ప్రశ్నించాడని పోలీసులను పంపించి మరీ అరెస్టు చేయించి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తోంది కోర్టు.. కానీ మీరేమో అరెస్టుల మీద అరెస్టులు చేయిస్తున్నారు.. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులు ఏంటి ? ప్రశ్నించే వాళ్లను జన సైనికులు చంపేస్తారా ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్.. దేశం చూస్తోంది.. ఇది కరెక్ట్ కాదు” అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్ .. మొత్తానికైతే ప్రశ్న రావణ్ కు అండగా పవన్ కళ్యాణ్ తీరుపై జన సైనికులు చేస్తున్న పనులను ఎండగడుతూ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రశ్న రావణ్ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Advertisement

Related News

మూకీ చిత్రం నుండి సైన్స్ ఫిక్షన్ వరకు.. సింగీతం శ్రీనివాస్ కెరియర్లో మరుపురాని చిత్రాలెన్నో!

చుట్టమల్లే వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన వర్మ.. అసలేం జరిగిందంటే?

అభిమాని బుగ్గలు గిల్లడంపై రచితా రామ్ ఏమన్నారంటే?

సింగీతం శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న సెలబ్రిటీస్!

సింగీతం సినిమాల గురించి.. నూటికో కోటికో ఒక్కరంటూ, నేటితరం దర్శకులు ఏమన్నారు?

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత!

ఇలా తయారయ్యారేంట్రా? ‘చుట్టమల్లే’ సాంగ్ పై విజయ్ దేవరకొండ ఫైర్

తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?

Big Stories

Advertisement
×