Prakash Raj: ప్రకాష్ రాజ్(Prakash Raj) ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి. అయితే ఈయన గత కొంతకాలంగా బీజేపీని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పోస్టులు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా పరోక్షంగా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈయన ఎక్స్ వేదికగా తన డిగ్రీ గురించి ట్వీట్ వేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పరోక్షంగా ఈయన ప్రధాని నరేంద్ర మోడీని(Narendra Modi) టార్గెట్ చేస్తూ ఆయనపై సెటైర్లు పేల్చారని స్పష్టం అవుతుంది. అసలు ప్రకాష్ రాజ్ ప్రధాని డిగ్రీ పట్టాపై పరోక్షంగా కామెంట్లు చేయడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే..
మోడీ డిగ్రీ బయట పెట్టాల్సిన పనిలేదు..
ప్రధాని నరేంద్ర మోడీ విద్యా అర్హతులపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర సమాచార కమిషన్ ఢిల్లీ యూనివర్సిటీని ప్రధాని మోడీ చదివిన డిగ్రీ పట్టా (Degree Graduation)బయట పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ విషయంలో గత కొంతకాలంగా వివాదం నెలకొంది తాజాగా నేడు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. యూనివర్సిటీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ కి సంబంధించిన వివరాలను బయట పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి తరుణంలోనే ప్రకాష్ రాజ్ తన డిగ్రీ వివరాలను బయటపెట్టారు.
డిగ్రీ పట్టభద్రుడిని కాదు..
ఈ సందర్భంగా ఈయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. భారత పౌరులు, ప్రధాని మోడీ నేను ప్రకాష్ రాజ్.. నేను డిగ్రీ పట్టభద్రుడిని కాదని తెలిపారు. తాను సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం కోసం తన డిగ్రీని మధ్యలోనే వదిలి పెట్టానని ఆయన తెలిపారు. ఇలా తాను డిగ్రీ పూర్తి చేయలేదని, తాను ఏమాత్రం సిగ్గు పడటం లేదని ఈ విషయాన్ని దాచుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదు అంటూ ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చివరిలో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఈ పోస్ట్ షేర్ చేశారు. అయితే ఈయన షేర్ చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించే చేశారని మరోసారి ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని డిగ్రీ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈయన ఈ పోస్ట్ చేయటం గమనార్హం.
Public Notice
To,
The Citizens &
The Prime Minister of INDIAI am Prakash Raj, i am not a DEGREE holder.
I discontinued to pursue my creative career.
I am not ASHAMED of it.
I don’t want to HIDE it . #justasking pic.twitter.com/yo8uB2mSiC— Prakash Raj (@prakashraaj) August 27, 2025
ఇకపోతే మొదటి నుంచి కూడా బీజేపీ గురించి పరోక్షంగా ట్వీట్లు వేస్తూ ఈయన వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రకాష్ రాదు సినిమాల కంటే కూడా ఇలాంటి వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఏపీలో కూడా సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తరచూ టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఇటీవల రాజకీయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read: Peddi Movie: రామ్ చరణ్ పెద్ది నుంచి బిగ్ అప్డేట్… స్పెషల్ వీడియో వదిలిన టీమ్!