ఒకప్పుడు ఇంటర్వ్యూలు అంటే నేరుగా ఆఫీస్ కు వెళ్లేవారు. తమకు సంబంధించి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తో పాటు ఎక్స్ పీరియెన్స్ కు సంబంధించిన వివరాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు. అయితే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే, కొంత మంది ఈ విధానాన్ని మిస్ యూజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను మాయ చేసి ఉద్యోగం పొందే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ తెలుగు యువతి కూడా ఇలాగే చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
రీసెంట్ గా ఓ తెలుగు యువతిఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరైంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో సదరు యువతి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. కెమెరా ముందు ఆమె కనిపించింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగే ప్రశ్నలకు కెమెరా వెనుక నుంచి మరో అమ్మాయి సమాధానాలు చెప్తుంది. కెమెరా ముందు తను కనిపిస్తూ లింప్ సింక్ చేస్తుంది. ఎక్కడో అనుమానం కలిగిన ఇంటర్వ్యూయర్ ఆమెను ఇయర్ ఫోన్స్ పెట్టుకోమని చెప్తాడు. ఆమె “నా దగ్గర ఇయర్ ఫోన్ లేదు” అని సమాధానం చెప్పాల్సిందిపోయి.. “వాళ్ల దగ్గర ఇయర్ ఫోన్ లేదు” అని చెప్పింది. వెంటనే ఆమె చేస్తున్న మోసం బయటపడింది.
Caught a Telugu woman doing a lip sync during an interview couple of weeks back. When asked to use earphones, instead of saying, “I don’t have an earphone,” she replied, “They don’t have an earphone.” 😅 https://t.co/RzjbyYiHMM pic.twitter.com/52OrrCEWk3
— Mal-Lee (@MallikarjunaNH) August 25, 2025
Read Also: డిమార్ట్ లో ఈ మహిళల్లా అస్సలు చేయకండి, లేదంటే బుక్కవ్వడం పక్కా!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి అతి తెలివిని ప్రదర్శించే వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాలేరని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు అప్పటికప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా, ఉద్యోగంలో రాణించలేరంటున్నారు. “ఆమె చేసిన పనికి నేను సపోర్టు చేయడం లేదు. కానీ, ఇలా ఆమె వీడియోను షేర్ చేయడం మంచిపద్దతి కాదు. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేం” అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. “నేను గత 2-3 సంవత్సరాలలో చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. ఇలాంటి వారికి చాలా మందిని పట్టుకున్నాను. కొంతమంది వ్యక్తులు లిప్ సింకింగ్ ను గుర్తించకుండా తప్పించుకోవడానికి కెమెరా రిజల్యూషన్ సరిగా లేని కెమెరాలను ఉపయోగిస్తున్నారు” అని మరో వ్యక్తి రాసుకొచ్చారు. “2010లో నేను ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అతడిని ఎంపిక చేసుకున్నాను. అతడు రెండు వారాల తర్వాత ఉద్యోగంలో చేరాడు. మరో రెండు వారాలు గడిచాయి. టీమ్ తో ఇంటరాక్షన్ సందర్భంగా అతడితో నేరుగా మాట్లాడడాను. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి వాయిస్, అతడి వాయిస్ పూర్తి భిన్నంగా ఉండటంతో నేను ఆశ్చర్యపోయాను” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: ఇదేం శిక్ష.. యువతిని రేప్ చేసిన వ్యక్తి.. అతడి చెల్లిని బహిరంగంగా రేప్ చేయాలని తీర్పు!