BigTV English

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది నుంచి బిగ్ అప్డేట్… స్పెషల్ వీడియో వదిలిన టీమ్!

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది నుంచి బిగ్ అప్డేట్… స్పెషల్ వీడియో వదిలిన టీమ్!

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రస్తుతం బుచ్చిబాబు(Bucchi Babu) సాన దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie)షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా సినీ కార్మికుల సమ్మె కారణంగా సినిమాలన్నీ కూడా షూటింగ్ ఆగిపోయాయి. అయితే సినీ కార్మికుల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో తిరిగి సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతున్నాయి ఈ క్రమంలోనే పెద్ద టీం సైతం సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ విడుదల చేశారు. నేడు వినాయక చవితి పండుగ కావడంతో చిత్ర బృందం వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఒక సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని ప్రకటించారు.


రెహమాన్ గారి డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా మారబోతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ..” రెహమాన్ గారి డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు కలిస్తే మెగా పవర్ స్టార్ బ్లాస్ట్ “అవుతుంది అంటూ బుచ్చిబాబు ఈ పాటపై హైప్ పెంచుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి తదుపరి షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తుంది. తదుపరి షెడ్యూల్ మైసూర్ లో జరగబోతున్నట్టు సమాచారం.


విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పెద్ది…

ఇన్ని రోజులు బంద్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ లుక్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింప్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాపై రామ్ చరణ్ కూడా చాలా గట్టి నమ్మకంతోనే ఉన్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మెగా కుటుంబం నుంచి వస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. మెగా అభిమానులు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక చరణ్ విషయానికి వస్తే ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో మంచి హిట్ కొట్టారు ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మెగా అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా పెద్దిపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Chiranjeevi: స్పిరిట్ సినిమాలో మెగాస్టార్…అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగ మామ!

Related News

OG Suvvi Suvvi Song: ఏంటీ ఓజీ సువ్వి సువ్వి సాంగ్ కూడా కాపీనా..ఇలా దొరికిపోయావ్ ఏంటీ తమన్!

Prakash Raj: ప్రధాని మోడీపై సెటైర్లు పేల్చిన ప్రకాష్ రాజ్.. సిగ్గుపడాల్సిన పనిలేదంటూ!

OG Update:పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓజీ నుండి అప్డేట్.. లిమిటెడ్ స్టాక్.. త్వరపడండి!

Heroine Poorna: ఈ దూరం భరించలేను.. సంచలన పోస్ట్ పెట్టిన పూర్ణ!

Chiranjeevi: స్పిరిట్ సినిమాలో మెగాస్టార్…అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగ మామ!

Big Stories

×