Prakash Raj statement after ed questioned: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు ప్రకాశ్ రాజ్ ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇవాళ ఆయన ఈడీ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సుమారు ఐదు గంటలపాటు ఈడీ ఆయనను విచారించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సక్లన్స్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఐదేళ్లలో జరిగిన లావాదేవీలకు సంబంధించి ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం.
ఈడీ అడిగిన ప్రశ్నలు ఇవే
అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో తన బ్యాంక్ స్టేట్‌మెంట్లను ప్రకాశ్‌రాజ్ సమర్పించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఇంకెప్పుడూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాశ్ రాజ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. విచారణ అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు. “అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. బెట్టింగ్ యాప్ విషయంలో ఏం జరిగిందని ఆరా తీశారు. ఒక పౌరుడిగా నా బాధ్యతతో అన్ని విషయాలు వెల్లడించాను. ఇప్పటి వరకు నేను ఒక్క నగదు లావాదేవీ కూడా చేయలేదు. విచారణకు కో–ఆపరేట్ చేయడం నా బాధ్యత. మళ్ళీ నన్ను విచారణకు రావాలని ఏం చెప్పలేదు” అని తెలిపారు. అనంతరం బెట్టింగ్ యాప్స్ ఆడకండి.. కష్టపడి డబ్బు సంపాదించండి అంటూ ఆయన సూచించారు.
రానా డుమ్మా
కాగా ఈ కేసులో ప్రకాశ్ రాజ్‌తో పాటు హీరో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఈడీ నోటీసులు ఇచ్చింది. రానా జూలై 23న విచారణకు హాజరవ్వాల్సి ఉండగా.. షూటింగ్ కారణంగా హజరు కాలేకపోయాడు. దీంతో ఆగష్టు 11న హాజరుకావాలి పేర్కొంటూ ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇక ఆగష్టు 6, 10 తేదీల్లో విజయ్, మంచు లక్ష్మి హాజరుకావాల్సి ఉంది. నోటీసుల మేరకు ప్రకాశ్ రాజ్ నేడు ఈడీ ముందు వచ్చారు. కాగా తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై జులుం విధించింది. ఈ యాప్స్ వల్ల ఎంతోమంది సామన్యులు బెట్టింగ్స్‌కి పాల్పడుతూ అప్పులపాలు అవుతున్నారు. ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహరంలో ఎంతోమంది యువకులు బలవన్మరణం చెందారు.
వారిపై కూడా కేసు
దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్మించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ యాప్స్‌ని ప్రమోట్ చేసి సామాన్యులను ప్రభావితం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ, టీవీ, సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సర్స్‌లు దాదాపు 29 మందిపై కేసు నమోదు చేశారు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వారిలో హీరో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్లతో పాటు యాంకర్ విష్ణు ప్రియ, రితూ చౌదరి, సిరి హనుమంతు.. సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సర్ భయ్యా సన్నీ యాదవ్‌తో పాటు పలువురిపై కేసు నమోదైంది.
Also Read: AR Rahman:8ఏళ్ల తర్వాత హైదరాబాద్లో రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్, జొమోటోలో టికెట్స్.. ధరేంతో తెలుసా?