Pooja Hegde: పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు. బుట్ట బొమ్మగా తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న పూజ ఇటీవల కాలంలో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పూజ హెగ్డే(Pooja Hegde) నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు కావడంతో ఈమె క్రమక్రమంగా అవకాశాలను కోల్పోతూ వచ్చారు.. ప్రస్తుతం సినిమాల పరంగా ఎలాంటి అవకాశాలు లేకపోయినప్పటికీ పూజా హెగ్డే క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఈమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా 2 కార్యక్రమంలో పాల్గొన్న పూజా హెగ్డే ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఇటీవల మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న బుట్ట బొమ్మకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. రాపిడ్ ఫెయిర్ సెషన్ లో భాగంగా ఒకవేళ హీరోలతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని భావిస్తే ఏ హీరోతో వెళ్తావు అంటూ ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చారు.
మొదటి ఆప్షన్ లో భాగంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అలాగే సీఎం విజయ్ (C.M.Vijay) ఇద్దరిలో ఎవరితో లాంగ్ డ్రైవ్ వెళ్తారంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు పూజా హెగ్డే సమాధానం చెబుతూ కచ్చితంగా తాను సీఎం విజయ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని కోరుకుంటాను అంటూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తూ అది అవ్వదమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సీఎం హోదాలో ఎంతో బిజీగా గడుపుతున్న నేపథ్యంలో పూజా హెగ్డే కోరిక తీరదన్న ఉద్దేశంలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే పూజ హెగ్డే విజయ్ కలిసి బీస్ట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలో విజయ్ చిత్ర బృందంతో పాటు పూజా హెగ్డేని కూడా తన రోల్స్ రాయిస్ లో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కూడా ఈమె విజయ్ తో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఉందని చెప్పటం గమనార్హం. అయితే ఇక్కడ ప్రభాస్ ని రిజెక్ట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు స్పందిస్తూ మా డార్లింగ్ నే రిజెక్ట్ చేస్తున్నావా పూజా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ పూజ హెగ్డే కాంబినేషన్లో రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read: ప్రకాష్ రాజ్ కు చేజారిపోతున్న సినిమా అవకాశాలు.. రాజకీయాలే కారణమన్న భార్య!