E-Paper
Advertisement

మిమ్మల్ని బొక్కలో వేసి తన్నే రోజులు త్వరలోనే వస్తాయి.. అద్దంకి దయాకర్ వార్నింగ్!

మిమ్మల్ని బొక్కలో వేసి తన్నే రోజులు త్వరలోనే వస్తాయి.. అద్దంకి దయాకర్ వార్నింగ్!
Advertisement

Addanki Dayakar: కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాకుండా కొడుకు, అల్లుడితో రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని అద్దంకి దయాకర్ రావు అన్నారు. నీచ, నికృష్ట, రోత రాజకీయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా లేవు. ఈ స్థాయికి దిగజారి ఎందుకు రాజకీయాలు చేయాల్సి వస్తుందో కేసీఆర్ ఆలోచించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఎవరూ దోచుకోనంతగా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని, కేసీఆర్‌ను వ్యతిరేకించే వారిని కించపరచడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు. అధికారం ఉన్నప్పుడు ఒక్కరిని కూడా కలవని వాళ్లు ఇప్పుడు ఉదయం, సాయంత్రం మీటింగ్‌లు పెట్టి విమర్శలు చేస్తున్నారని అన్నారు.

కుటుంబాన్ని లాగే ప్రయత్నం..

సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం చేతకాక కల్వకుంట్ల కుటుంబం చేవలేని రాజకీయాలు చేస్తోంది. భూముల ఆక్రమణ వ్యవహారాలను బయటపెడితే గిలగిలా కొట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బయటకు లాగి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని కార్నర్ చేయడానికి కుటుంబాన్ని లాగుతున్నారు. కల్వకుంట్ల కుటుంబం ఎంత గింజుకున్నా సీఎం రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఆయన ఎలాంటి తప్పులు చేయలేదని అన్నారు. ఎందుకు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నామా అని కల్వకుంట్ల కుటుంబం బాధపడక తప్పదని అన్నారు.

ఆస్తులు ఎందుకు పెరగలేదు?

Advertisement

కేసీఆర్ కుటుంబం కంటే ముందు రాజకీయాల్లో ఉన్నవాళ్ల ఆస్తులు ఎందుకు పెరగలేదు? భూముల వ్యవహారాలను బయట పెట్టినందుకే రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బ్లాక్ మీడియాను నడిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బ్లాక్ పార్టీగా వ్యవహరిస్తోందని అద్దంకి దయాకర్ రావు అన్నారు. సిగ్గుమాలిన రోత రాజకీయాలను కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. ఇంత చిల్లర రాజకీయాలు ఎవరూ చేయడం లేదు. రాజకీయ విమర్శలు చేస్తే పరువు నష్టం దావాలు వేస్తున్నారు. భవిష్యత్తు లేదని తేలిస్తే దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. తంతాం జాగ్రత్త.. అది పెద్ద విషయం కాదు అని సంచలన వ్యాక్యలు చేశారు.

Also Read: సినీ హిస్టరీలో కొత్త అధ్యాయం.. 70ఎంఎం స్క్రీన్ పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్!

మీతో మాకేం పోలీకా..

Advertisement

కేసీఆర్ కూడా ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారని అనుకోలేదు. తెలంగాణ రాజకీయాలను నాశనం చేయడానికి మీకేం హక్కు ఉంది? ఆత్మగౌరవం లేని దద్దమ్మలు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీతో మీకు ఏ విషయంలోనూ పోలిక లేదు. దోచుకున్నవాళ్లు ఎప్పటికీ నాయకులు కాలేరని అన్నారు. తెలంగాణ సొమ్మును దిగమింగి బలుపెక్కి కొట్టుకుంటున్నారు. బల్మూర్ వెంకట్ లాంటి చిన్నోడు తన కాళ్లపై నిలబడి నాయకుడు అయ్యాడు. మా లాంటి వాళ్లతో కేటీఆర్, హరీష్ రావుకు ఏం పోలిక రేవంత్ రెడ్డి కుటుంబం 17 ఏళ్ల పాటు అనేక సమస్యలను ఎదుర్కొన్నదని అన్నారు.

బెడ్‌రూమ్‌లోకి వెళ్లి..

కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆ కుటుంబాన్ని వేధించారు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి మరీ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కల్వకుంట్ల కుటుంబం అడ్డుకుంటోంది. ప్రతిపక్షంగా మీరు అడ్డుకోవడానికే ఉన్నారా? ఎందుకున్నారు మీరు? మేం అధికారంలో లేకపోతే తెలంగాణను ప్రశాంతంగా ఉండనివ్వమని కేసీఆర్ కుటుంబం అనుకుంటోందని అన్నారు. రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు కేవలం రూ.2 లక్షలకు ఎకరం చొప్పున ఎలా కొనగలిగాడు? రాజకీయ విమర్శలు చేస్తే పరువు నష్టం దావాలు వేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు క్షుద్రపూజలు చేస్తారన్న కవితపై ఎందుకు పరువు నష్టం దావా వేయలేదు? రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్న అక్కసుతోనే దిగజారి విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

నీచ చరిత్ర..

బొక్కలో వేసి తన్నే రోజులు కూడా త్వరలోనే వస్తాయి. తొందరపడొద్దు. కల్వకుంట్ల కుటుంబం దిగజారుడు రాజకీయాలపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని, మా రేవంత్ రెడ్డి కుటుంబం, ఆయనకు దగ్గరగా ఉన్నవారిపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అస్తిత్వం కోసం 1,200 మంది చనిపోవడానికి కారణం హరీష్ రావు, కేటీఆర్ అని అన్నారు. తొడగొడతాం జాగ్రత్త. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చరిత్ర అర్థాంతరంగా ముగియడం ఖాయం అంటూ అద్దంకి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: భారత్‌లోనే విదేశీ అందాలు.. ఈ 5 ప్రదేశాలను చూస్తే స్విట్జర్లాండ్ వెళ్లినట్లే ఫీలవుతారు!

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!

40 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా వదల్లేదు.. రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు!

నల్గొండలో దారుణం.. తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

రావల్‌కోల్‌లో వీధి కుక్కల బీభత్సం.. 10 గొర్రెలు మృతి, రూ. 2 లక్షల నష్టం!

తెలంగాణలో సీనియర్ రెసిడెంట్ పోస్టింగ్‌ల రగడ.. రికమెండేషన్ దందాలకు చెక్!

ర్యాపిడోలో బంగారం పార్సిల్.. చేతివాటం చూపించిన డెలివరీ బాయ్!

సీజ్ చేసిన ఫోన్‌తో రూ.1.70 లక్షలు బదిలీ.. 12 తులాల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

Big Stories

Advertisement
×