E-Paper
Advertisement

ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్

ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్
Advertisement

Crime Thriller Series OTT : సస్పెన్స్, క్రైమ్, సైకో కిల్లర్ డ్రామాలు అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చే ఐకానిక్ క్యారెక్టర్ డెక్స్టర్ మోర్గాన్. నేరస్తులను మాత్రమే టార్గెట్ చేస్తూ, తనదైన స్టైల్‌లో హత్యలు చేసే ఈ సీరియల్ కిల్లర్ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే పలు సీజన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డెక్స్టర్ కథ ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు తీసుకోబోతోంది. అతడి ప్రపంచంలోకి మరో ప్రమాదకరమైన సైకో కిల్లర్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు కిల్లర్లు ఒకే నగరంలో తలపడితే ఎలాంటి మైండ్ గేమ్స్ నడుస్తాయి? ఇలాంటి ఇంటెన్స్ క్రైమ్ డ్రామాతో వస్తున్న సిరీస్ ‘డెక్స్టర్ రిసరెక్షన్ సీజన్ 2’ (Dexter Resurrection Season 2). మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

డెక్స్టర్ మోర్గాన్ (Dexter Morgan) అలియాస్ డెక్స్టర్ జీవితం ఎప్పుడూ ఓ డబుల్ గేమ్‌లాగే ఉంటుంది. సాధారణ వ్యక్తిలా కనిపించే అతడు, ఓ ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్. అయితే అతడి హత్యలకు ఓ ప్రత్యేకమైన రూల్ ఉంటుంది. సమాజానికి హాని చేస్తున్న నేరస్తులనే టార్గెట్ చేస్తూ తనదైన పద్ధతిలో వారిని అంతం చేస్తుంటాడు. పోలీసుల కళ్లుగప్పి తన మరో ప్రపంచాన్ని కొనసాగించడం డెక్స్టర్‌ కు అలవాటే. అయితే ఈ కొత్త సీజన్‌ లో అతడికి ఓ కొత్త సవాల్ ఎదురవుతుంది. డెక్స్టర్ తన పని తాను చేసుకుంటున్న సమయంలోనే అదే నగరంలో మరో సైకో కిల్లర్ వరుస హత్యలతో కలకలం సృష్టిస్తాడు. అతడి హత్యలు, వాటి వెనుక కనిపించే క్రూరమైన విధానం పోలీసులను సైతం గందరగోళానికి గురిచేస్తాయి.

Advertisement

ఇప్పటివరకు తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ ను ఏర్పరుచుకున్న డెక్స్టర్‌ కు కూడా ఈ కొత్త కిల్లర్ వ్యవహారం తలనొప్పిగా మారుతుంది. ఇక్కడే కథలో మైండ్ గేమ్ మొదలవుతుంది. ఇద్దరు కిల్లర్ల లక్ష్యాలు ఒకే దిశగా సాగుతుండటంతో, ఒకరి ఉనికిని మరొకరు గుర్తించే పరిస్థితి వస్తుంది. పోలీసుల దర్యాప్తు ఓవైపు కొనసాగుతుంటే, మరోవైపు డెక్స్టర్ తన ప్రత్యర్థి కదలికలను గమనిస్తూ ఉంటాడు. కొత్త కిల్లర్‌ను ఎవరు ముందుగా కనిపెడతారు ? అతడి అసలు కథేంటి ? డెక్స్టర్ తన రహస్యాన్ని బయట పడకుండా ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటాడు ? ఈ ఇద్దరి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్‌లో పైచేయి ఎవరిది ? అనేదే ఈ సీజన్‌లో ఆసక్తికరమైన అంశం.

Also Read : గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

Advertisement

మైఖేల్ సి. హాల్ (Michael C. Hall) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు క్లైడ్ ఫిలిప్స్ (Clyde Phillips) షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘డెక్స్టర్ రిసరెక్షన్’ సిరీస్‌కు సంబంధించిన రెండో సీజన్ పారామౌంట్ ప్లస్ (Paramount+) వేదికపై విడుదల కానుంది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్ ఆడియోలోనే అందుబాటులో ఉంది. సీరియల్ కిల్లర్ కథలు, సైకో థ్రిల్లర్లు, ఊహించని మైండ్ గేమ్స్ ఉన్న సిరీస్ లు కావాలంటే డెక్స్టర్ కొత్త సీజన్ ను డోంట్ మిస్.

Related News

వెకేషన్ కోసం ఇళ్లు మార్చుకున్న జంటలు… చివరకు మర్డర్ మిస్టరీలో… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

జూన్‌లో మగవాళ్లకు మృత్యుగండం… ఏడేళ్లకోసారి తిరగబెట్టే శాపం… ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ను ఇంకా చూడలేదా ?

మాస్క్‌లు వేసుకుని ప్రాణాలు తీసే కిల్లర్లు… ఈసారి తాడోపేడో తేల్చుకోవాల్సిందే… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

గంటకు 50 రెట్లు జీతం ఇస్తామంటూ జాబ్ ఆఫర్… ఒక్కో షిఫ్ట్‌లో ఊచకోత… క్రేజీ కొరియన్ హారర్ థ్రిల్లర్‌ తెలుగులో

పద్ధతిగా జరిగే పిల్లల బర్త్ డే పార్టీ… పెద్దల మధ్య చిచ్చుపెట్టే బహుమతి… ఈ రచ్చ తెలుగులోనూ స్ట్రీమింగ్

వామ్మో… పోలీసులే దొంగలు భయ్యా… దిమ్మతిరిగే హీస్ట్ థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

Big Stories

Advertisement
×