Preity Zinta:ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా(Priety zinta) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే మరొకవైపు పంజాబీ కింగ్స్ ఓనర్ గా వ్యవహరిస్తున్న ఈమె ఈ మధ్యకాలంలో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. బాంద్రాలోని అత్యంత సంపన్న ప్రాంతమైన “పాలిహిల్” లో తనకున్న లగ్జరీ అపార్ట్మెంట్ ను ఈమె తాజాగా రూ.18.5 కోట్లకు విక్రయించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గత నాలుగు నెలల్లోనే ఇలా భారీగా ఆస్తిని అమ్మేయడం ఇది రెండవసారి కావడంతో అసలు ఏం జరుగుతోంది అనే కామెంట్లు కూడా చేస్తున్నారు అభిమానులు.
ఇకపోతే గత ఏడాది నవంబర్లో ఇదే “రుస్తోమ్ జీ పరిశ్రమ్” బిల్డింగ్ లోని 11వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాటును 14 కోట్లకు పైగా ధరకు విక్రయించిన ఈమె.. ఇప్పుడు అదే అంతస్తులో ఉన్న మరో 1,770 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ను మార్చి 2 2026న అమ్మేశారు. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు దాదాపు 1.11 కోట్ల స్టాంపు డ్యూటీ కూడా చెల్లించినట్లు సమాచారం. ఇకపోతే ప్రీతి జింటా ఇలా వరుసగా ఆస్తులు విక్రయించడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. బాంద్రాలో ఉన్న దాదాపు రూ.100 కోట్ల విలువైన ఒక భారీ ప్రాపర్టీని ఆమె కొనుగోలు చేయడానికి ఇలా ఈ ఆస్తులు అన్నింటిని అమ్ముతున్నారని సమాచారం. ఇక చిన్న ఆస్తులను అమ్మేసి ఆ సొమ్మును అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారట. ఏది ఏమైనా ప్రీతి జింటా 100 కోట్ల ఆస్తిపై కన్ను వేసింది కాబట్టే ఇప్పుడు ఉన్న చిన్న చిన్న ఆస్తులను అమ్మేస్తూ డబ్బును పోగు చేసుకుంటున్నట్లు సమాచారం.
ALSO READ:Peddi Movie: పెద్ది క్లైమాక్స్ లో సంచలన ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
ఇకపోతే ఈ తరహాలో కేవలం ప్రీతి మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలు కూడా భారీ రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. 2025లో అక్షయ్ కుమార్ తన ఆస్తుల ద్వారా సుమారుగా 100 కోట్లకు పైగా డబ్బును ఆర్జించగా, బిగ్ బీ కూడా అదే రేంజ్ లో డీల్స్ కుదుర్చుకోవడం గమనార్హం అలాగే జితేంద్ర, ఏక్తాకపూర్ లు కూడా తమ అపార్ట్మెంట్ ను 12.25 కోట్లకు విక్రయించి వార్తలలో నిలిచారు. మొత్తానికైతే అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న ఆస్తులను అమ్మేసి ఒకే చోట పెద్ద ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ డీల్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు అని చెప్పవచ్చు. ప్రీతి జింటా విషయానికి వస్తే.. తెలుగులో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది . ఏది ఏమైనా ఇలా ఇప్పుడు మరోసారి ఆస్తులను అమ్మేసి వార్తల్లో నిలవడం గమనార్హం.