E-Paper
Advertisement

అనిరుధ్ – కావ్య మారన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

అనిరుధ్ – కావ్య మారన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Advertisement

Anirudh – Kavya:కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravi Chander), సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kavya Maran)పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు వీరి పెళ్లి కోసం గ్రీస్ చేరుకుంటున్నారు. అటు సూపర్ స్టార్ రజినీకాంత్ , మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు ఉదయినిది స్టాలిన్ కుటుంబ సమేతంగా గ్రీసు దేశానికి బయలుదేరారు. నవంబర్ 10 , 11 తేదీలలో రెండు రోజులపాటు గ్రీస్లో చాలా ఘనంగా ఈ వివాహం జరగనుంది. అతిరథమహారధుల సమక్షంలో జరగబోయే ఈ వివాహ వేడుక కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అందులో ఒకటి కావ్య -అనిరుధ్ మధ్య ఏజ్ గ్యాప్.

కావ్య -అనిరుధ్ మధ్య ఏజ్ గ్యాప్?

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ మధ్య వయసు వ్యత్యాసం సుమారుగా ఒక సంవత్సరం 10 నెలలు. వీరిద్దరిలో అనిరుధ్ పెద్దవాడు. అనిరుధ్ రవిచందర్ 1990 అక్టోబర్ 16న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 36 సంవత్సరాలు. అటు కావ్య మారన్ 1992 ఆగస్టు 6వ తేదీన జన్మించారు. ఆమె వయసు 34 సంవత్సరాలు. ఇంకా సంవత్సరాలను బట్టి చూస్తే ఇద్దరి మధ్య రెండేళ్లు మాత్రమే వయసు తేడా ఉంది.

Advertisement

ALSO READ:అంతర్జాతీయ స్థాయిలో కౌశల్ మండాకు కీలక బాధ్యతలు..30 ఏళ్ల అనుభవంలో?

కావ్య -అనిరుధ్ విద్యార్హత?

కావ్య మారన్ విద్యార్హత విషయానికి వస్తే.. చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజ్ నుండి బీకాంలో డిగ్రీ పట్టా అందుకున్న ఈమె.. యునైటెడ్ కింగ్డమ్ లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)పూర్తి చేసింది. అటు అనిరుధ్ రవిచందర్ విద్యార్హత విషయానికి వస్తే ఈయన చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ లో తన స్కూల్ విద్యను పూర్తి చేసి.. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అలాగే లండన్ లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి పియానో శిక్షణ పొందిన ఈయన.. కర్ణాటక సంగీతంలో కూడా శిక్షణ పొందారు. అలాగే చెన్నైలోని సౌండ్ టెక్ మీడియా ఆడియో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ నుండి సౌండ్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కూడా పూర్తి చేశారు.

పెళ్లి కోసం సిద్ధమవుతున్న కావ్య – అనిరుధ్..

Advertisement

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే అయితే ఎక్కడ కూడా వీరిద్దరూ తమ ప్రేమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఎప్పటికప్పుడు ఈ జంట పెళ్లి పై ఎన్నో రూమర్లు వినిపించాయి. అటు అనిరుధ్ బంధువు కూడా వీరి పెళ్లిపై కీలక కామెంట్లు చేశారు. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. మరి గ్రీస్లో జరగబోయే ఈ వివాహ వేడుకలో మూడు ముళ్ళు ఏడడుగులతో ఈ వేరు ఒక్కటి కాబోతున్నారు.

Related News

అనిరుద్ కావ్య వెడ్డింగ్.. గ్రీస్ లో ల్యాండ్ అవుతున్న స్టార్స్!

మంచివాడిలా కనిపిస్తూనే విలనిజం.. గొల్లపూడి స్టైల్‌కు ఫిదా అవ్వాల్సిందే!

రామాయణంలో సీత పాత్ర పై.. అలనాటి సీత షాకింగ్ కామెంట్స్!

లక్ష్మీదేవిలా మెరిసిన మృణాల్.. ఈ అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

హీరో దర్శన్ కు భారీ ఊరట.. కోర్ట్ గ్రీన్ సిగ్నల్!

బాక్సాఫీస్ దగ్గర రామాయణ వర్సెస్ సూర్య.. ఎవరి హవా వారిదే!

పెళ్లి బారాత్‌లో నాగదుర్గ డ్యాన్స్ ఇరగదీసిందిగా..!

Big Stories

Advertisement
×