Anirudh -Kavya Maran wedding: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్న సంగతి తెలిసిందే. ఈయన తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఏకైక వారసురాలు ఎస్ఆర్ హెచ్ సీఈవో కావ్య మారన్(Kavya Maran) తో కలిసి ఏడడుగులు వేయబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రమే ఎక్కడ స్పందించలేదు అయితే పెద్దల సమక్షంలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
అనిరుద్ కావ్యల వివాహ వేడుక గ్రీస్ (Greece) వేదికగా జరగబోతున్న సంగతి తెలిసిందే. వివాహ వేడుకలో భాగంగా కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారు. ఇక వీరి వివాహం నవంబరు 10, 11వ తేదీలలో జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అనిరుద్ కావ్య ఫ్యామిలీలు గ్రీస్ చేరుకున్నారు. ఇక ఈ పెళ్లి వేడుక నిమిత్తం ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు కూడా గ్రీస్ లో ల్యాండ్ అవుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తన ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో గ్రీస్ బయలుదేరారు.
ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ (M.K.Stalin)కుటుంబ సభ్యులు కూడా అనిరుద్ కావ్య వివాహంలో భాగంగా గ్రీస్ వెళ్లారని తెలుస్తోంది. ఇక అనిరుద్ రజనీకాంత్ అల్లుడు అనే సంగతి మనకు తెలిసిందే. ఇక కావ్య మారన్ ఎంకే స్టాలిన్ బంధువులు కావడంతో వీరు కూడా ఈ వివాహ వేడుకలో భాగమయ్యారు. ఈ పెళ్లి వేడుక కోసం సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరుగా గ్రీస్ లో ల్యాండ్ అవుతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారు. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్న ఈ జంట చాలా గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.
ఇక వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వీరి వివాహ రిసెప్షన్ వేడుక నవంబర్ 21వ తేదీ చెన్నైలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వేడుకలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులతో పాటు తమిళ రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. ఇలా వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం కావడంతో పెళ్లికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం కోసం అభిమానులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు కావ్య అనిరుద్ ఇద్దరూ కూడా పెళ్లికి సంబంధించిన విషయాలను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం.
Also Read: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సింగనమల బొబ్బిలి రణబాలి..ఎప్పుడంటే?