E-Paper
Advertisement

70s మైసూర్ వైబ్స్… అటు ట్రెడిషన్స్ ఇటు లవ్… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

70s మైసూర్ వైబ్స్… అటు ట్రెడిషన్స్ ఇటు లవ్… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ
Advertisement

Kannada Romantic Drama on OTT: పాతకాలం నాటి పీరియడ్ డ్రామాలు, అందులోనూ 1970ల బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్యూర్ లవ్ స్టోరీస్‌కు ఒక బ్యూటిఫుల్ ఆర్గానిక్ ఫీల్ ఉంటుంది. అప్పటి లైఫ్ స్టైల్, సంప్రదాయాలు, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు… ఇవన్నీ తెరపై చూస్తుంటే ప్రేక్షకులు కూడా ఆ కాలంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అలాంటి 70ల నాటి మైసూర్ వాతావరణంలో తెరకెక్కిన కన్నడ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామానే ‘Sarala Subbarao’. ప్రముఖ కన్నడ రచయిత్రి త్రివేణి రాసిన ‘వసంత గాన’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. చారిత్రక మైసూర్ వైబ్స్ తో తెరకెక్కిన ఈ సరికొత్త కన్నడ పీరియడ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. దీనిని ఏ ఓటీటీలో చూడచ్చు ? తెలుగులో ఉందా ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

కథలోకి వెళ్తే…

ఈ కథ 1970ల నాటి మైసూర్ నేపథ్యంలో సాగుతుంది. సుబ్బారావు (అజై రావు) ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఎంతో ప్రశాంతంగా, పద్ధతిగా తన జీవితాన్ని గడిపే అతడి ప్రపంచంలోకి సరళ (మిషా నారంగ్) అడుగుపెడుతుంది. సరళకు రచనలంటే ఆసక్తి. తన తొలి రచన ప్రచురణ కావడంతో ఎంతో సంతోషంగా ఉంటుంది. వీరిద్దరి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.

Advertisement

అయితే ఈ సినిమా కేవలం ప్రేమ, పెళ్లి చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు. ఒకరికొకరు తోడుగా ఉంటూ కుటుంబ జీవితాన్ని ఎలా నిర్మించుకున్నారు? తల్లిదండ్రులుగా మారిన తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పులేంటి? అనే అంశాలతో పాటు 1971లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధం ప్రభావం సామాన్య ప్రజల జీవితాలపై ఎలా పడిందన్న విషయాన్ని కూడా ఈ కథలో భాగం చేశారు. యుద్ధం సరిహద్దుల్లో జరుగుతున్నా, దాని భయం, ఆంక్షలు, అనిశ్చితి ఇంట్లో ఉన్నవారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయని సినిమాలో చూపించారు.

నెమ్మదిగా సాగే ఈ ప్రేమకథలో 70ల నాటి మైసూర్ వీధులు, పాత కాలపు ఇళ్ళు, అప్పటి జీవనశైలి ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. వేగవంతమైన యాక్షన్ హంగులు కాకుండా, అటు ట్రెడిషన్స్‌ని ఇటు ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ సాగే ఈ ఫీల్ గుడ్ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

తెలుగులో డబ్బింగ్ అందుబాటులో ఉందా ?

Advertisement

ఈ సినిమాలో సుబ్బారావుగా, మిషా నారంగ్ లీడ్ రోల్స్ లో నటించారు. మంజు స్వరాజ్ దర్శకత్వం వహించగా, లోహిత్ హెచ్. నంజుండయ్య నిర్మించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. నిడివి సుమారు 2 గంటల 10 నిమిషాలు. కన్నడ ఒరిజినల్ వర్షన్‌తో పాటు క్లియర్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఆప్షన్‌తో ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం దీనికి తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. మొత్తానికి వేగవంతమైన కథనాలు, భారీ యాక్షన్ హంగులు కాకుండా నెమ్మదిగా సాగే ప్రేమకథలు, పాతకాలపు కుటుంబ వాతావరణం, భార్యాభర్తల మధ్య అనుబంధాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్.

Read Also: బలవంతంగా పెళ్లి… వాయిస్‌ మెసేజ్‌తో కుప్పకూలిన సంసారం… హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ

Related News

మాజీ భార్యను వేధిస్తున్న వ్యక్తి ఖతం… కట్ చేస్తే రోడ్లపై పూనకాలు తెప్పించే హై-స్పీడ్ ఛేజ్

ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సింగనమల బొబ్బిలి రణబాలి..ఎప్పుడంటే?

ఒక్క రోజు ఇంటి పనులకే చుక్కలు… తల్లి కోసం పిల్లలకు డాడీ డెడ్లీ చాలెంజ్‌… తెలుగు ఫ్యామిలీ డ్రామా

చచ్చినా వదలని ప్రేమ మత్తు… కుక్క సాయంతో ప్రేయసికి చేరువగా… ది బాప్ ఆఫ్ ఎమోషనల్ రైడ్

అప్పుడే ఓటీటీలోకి రాబోతున్న జెన్ జీ మెచ్చిన మూవీ.. ఏది? ఎక్కడంటే?

ఆడుకుంటుంటే చేతికి చిక్కిన 5 కోట్ల అదృష్టం… రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత… పక్కా ఫ్యామిలీ డ్రామా

కాళ్ళకి చెప్పులు లేవు… కానీ కళ్ళలో వరల్డ్ కప్ కల… ఏడుగురు కుర్రాళ్ల అన్స్టాపబుల్ గూస్బంప్స్ స్టోరీ

Big Stories

Advertisement
×