E-Paper
Advertisement

నా పని అయిపోయింది.. వారణాసి నుండి కుంభ పాత్రపై పృథ్వీ కామెంట్!

నా పని అయిపోయింది.. వారణాసి నుండి కుంభ పాత్రపై పృథ్వీ కామెంట్!
Advertisement

Varanasi:సాధారణంగా రాజమౌళి (Rajamouli) తో పనిచేయాలి అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా ఒక సీన్ తాను అనుకున్నట్టు రాకపోతే నటీనటుల చెమటను చిందించైనా సరే ఆ షార్ట్ పర్ఫెక్ట్ గా వచ్చేలా చేస్తారనడంలో సందేహం లేదు. అందుకే రాజమౌళికి పని రాక్షసుడు అనే పేరు కూడా వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఆయన గ్లోబల్ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం వారణాసి.. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మరొకవైపు ప్రముఖ మాలీవుడ్ స్టార్ నటుడు కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ గత ఏడాది విడుదల చేసి.. సినిమాపై జక్కన్న అంచనాలు పెంచేశారు. అయితే ఇప్పుడు తన పాత్ర గురించి అప్డేట్ ఇచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్. తన పని అయిపోయింది అంటూ ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కుంభ పాత్ర పై పృథ్వీరాజ్ కుమారన్..

అసలు విషయంలోకి వెళ్తే.. వారణాసి సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో కుంభ అనే శక్తివంతమైన విలన్ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగిసిన సందర్భంగా యూనిట్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను పృథ్విరాజ్ పంచుకున్నారు.. “ఈ షెడ్యూల్ కోసం ఎంతో కష్టపడ్డాను. ఇక నా పని అయిపోయింది.. అందుకే పని పూర్తికాగానే ఆహార నియమాలను పక్కనపెట్టి నచ్చిన ఫుడ్ తీసుకున్నాను. ఇకపోతే ఈ ప్రయాణం ఎంత కష్టాన్ని ఇచ్చినా అంత సంతృప్తిని ఇచ్చింది”అంటూ రాజమౌళితో ఉన్న అనుబంధాన్ని, అలాగే చిత్ర బృందంతో ఏర్పడిన సాన్నిహిత్యం గురించి ఈ సినిమాలో తన పాత్ర గురించి అభిమానులతో పంచుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ . ఏది ఏమైనా పని రాక్షసుడు జక్కన్న సినిమాలోని పవర్ ఫుల్ సన్నివేశాల కోసం తిండి పెట్టకుండా పృథ్వీ రాజ్ ను కష్టపెట్టారా అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

also read:వైసీపీకి మద్దతుగా పూనమ్ సంచలన పోస్ట్.. వారిని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తోందా?

సరిగ్గా ఏడాది..

ఇదిలా ఉండగా మరొకవైపు చిత్ర బృందం సినిమాపై అంచనాలు పెంచేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్టు కూడా పెట్టింది. ఒకవేళ మనం కాలయానం చేస్తూ ఒక ఏడాది ముందుకు వెళ్తే ఈ సమయానికి మనం వారణాసి చిత్రాన్ని చూస్తూ ఉంటాము. ఇట్స్ షో టైం అంటూ ఏప్రిల్ 7వ తేదీన వచ్చే ఏడాది వారణాసి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఏడాది ముందుగానే ఒక పోస్టును పెట్టి అంచనాలు పెంచేసింది చిత్ర బృందం. ఇకపోతే సంగీత దర్శకుడు కీరవాణి ఎక్స్ లో ‘365’ అని కూడా పోస్ట్ పెట్టారు. ఇక దీనికి స్పందనగా రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పాటను ఎప్పుడు విడుదల చేస్తారు అని ప్రశ్నించగా..” సెట్ వేస్తున్నారంటగా దర్శకుడు” అంటూ మహేష్ బాబు పోకిరి స్టైల్ లో యూనిట్ కూడా సమాధానం ఇచ్చింది. ఇక దీంతో త్వరలోనే వారణాసి సినిమాకు సంబంధించిన మొదటి పాట అప్డేట్ రావచ్చని అభిమానులు కూడా భావిస్తున్నారు.. ఇకపోతే ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై కేఎల్ నారాయణ సుమారుగా 1200 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా పాన్ వరల్డ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×