E-Paper
Advertisement

Varanasi: రాజమౌళిని ఆ ఒక్క కోరిక కోరిన ప్రియాంక చోప్రా.. మహేష్ బాబును బుక్ చేసేసిందిగా!

Varanasi: రాజమౌళిని ఆ ఒక్క కోరిక కోరిన ప్రియాంక చోప్రా.. మహేష్ బాబును బుక్ చేసేసిందిగా!
Advertisement

Varanasi: అయన ఒక్కో మూవీ ఒక్కో అద్బుతం ‘RRR’ సృష్టించిన గ్లోబల్ ఇంపాక్ట్ తర్వాత, రాజమౌళి తన తదుపరి అడుగు ఎటువైపు వేస్తారా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. ఈ క్రమంలో ఆయన ప్రకటించిన ‘వారణాసి’ చిత్రం అంచనాలను రెట్టింపు చేసింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రియాంక చోప్రా పెట్టిన ఒక చిన్న కోరిక మహేష్ బాబును ఎలా ఇబ్బంది పెట్టిందో తాజాగా మూవీ టీం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ..ఆ విశేషాలు చూద్దాం ..

ప్రియాంక ‘డ్యాన్స్’ కండిషన్:

ఇక సుమారు ఏడేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా ‘వారణాసి’తో తిరిగి ఇండియన్ సినిమాల్లోకి అడుగుపెడుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేముందు ఆమె రాజమౌళికి ఒక విజ్ఞప్తి చేసిందట. “నేను ఇండియన్ సినిమాలో నటించి చాలా కాలమైంది, ఈ చిత్రంలో నాతో డ్యాన్స్ చేయిస్తారా?” అని ఆమె కోరింది. ప్రియాంక అభ్యర్థన మేరకు రాజమౌళి ఒక భారీ డ్యాన్స్ నంబర్‌ను ప్లాన్ చేశారు. అయితే, ఆమె కోరిన ఈ కోరిక తన సహనటుడైన మహేష్ బాబుపై ఊహించని ప్రభావం చూపింది. ప్రియాంక డ్యాన్స్ అడిగినందుకు మహేష్ కూడా ఆమెతో కలిసి స్టెప్పులు వేయాల్సి వచ్చింది. “నీ వల్లే నేను కూడా డ్యాన్స్ చేయాల్సి వస్తోంది” అంటూ మహేష్ ఆమెను సరదాగా ఆటపట్టించడం ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచింది.

Advertisement

ALSO READ:Varanasi: ఆ వీల్‌ చైర్ కేవలం వస్తువు కాదు.. అది ఒక ఆయుధం.. పృథ్వీరాజ్ పాత్రపై క్రేజీ అప్డేట్!

ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్న ప్రియాంక..

చాల కలం తరువాత 2013లో రామ్ చరణ్ సరసన ‘తూఫాన్’ (జంజీర్ రీమేక్) చిత్రంతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన ‘వారణాసి’ చిత్రంలో నటిస్తుండటంతో ఆమె తెలుగు సినిమా రీ-ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆమె తెలుగు డైలాగులను స్వయంగా నేర్చుకుంటూ, ఒక ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం.

రాజమౌళి గ్లోబల్ విజన్.. 2027 ఏప్రిల్‌లో విడుదల:

Advertisement

పురాణాలు, అడ్వెంచర్ , టైమ్ ట్రావెల్ కలబోసిన ఈ చిత్రాన్ని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతుండగా, వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా విడుదల కానుంది. మహేష్ బాబు ఇందులో ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో, శ్రీరాముడి ఛాయలున్న గెటప్‌లో కనిపిస్తారని ఇప్పటికే లీక్ వచ్చింది. పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టనున్నారు. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలవబోతోంది అని ఫాన్స్ భావిస్తున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×