Software Engineer: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, ఈ రంగంలో పనిచేసే యువతీ యువకులు తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో ఆత్మహత్యలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అధిక పని ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కొంతమంది ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడడం.. అప్పుల భారం కావడంతో సూసైడ్ చేసుకుంటున్నారు.. మరికొంత మంది కుటుంబ కలహాలు, వ్యక్తిగత సంబంధాల సమస్యల వల్ల కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా.. హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. మణికొండలో ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సొసైటీ తనకు నచ్చడం లేదని సూసైడ్ లెటర్ రాసి మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. వెంకట గోపాల్ అని 26 ఏళ్ల యువకుడు గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
ALSO READ: Weather News: వర్షాల నుంచి బిగ్ రిలీఫ్.. కానీ ఈ ఏరియాల్లో పిడుగుల వర్షం..?
ఇటీవలే వెంకట గోపాల్ కుటుంబ సభ్యులతో ఊరు వెళ్లి ఒంటరిగా తిరిగి వచ్చాడని పోలీసులు తెలిపారు. అనంతరం కొన్ని రోజులు ఆఫీస్ కు వెళ్లాడని.. ఆ తర్వాత మణికొండలోని ఫ్లాట్ లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. విచారణ అనంతరం ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
ALSO READ: TCS Layoffs: టీసీఎస్ సంచలన నిర్ణయం.. 12,200 మంది ఉద్యోగులకు భారీ షాక్..!
అయితే సూసైడ్ లెటర్ లో ఆతను ఈ విధంగా రాశాడు.. ‘నాకు ఈ సొసైటీ నచ్చడం లేదు. ఈ జనాల మధ్య బతకాలని అనిపించడం లేదు. హైదరాబాద్ లో పొల్యూషన్ నాకు నచ్చడం లేదు. సమాజంలో రాజకీయ నాయకుల అవినీతి రోజు రోజుకీ భారీగా పెరిపోతుంది. రాజకీయ నాయకులు మారాలి. నాకు ఈ భూమిపై బతకాలని లేదు. క్షమించండి అమ్మా.. నాన్న’ అని లెటర్ లో రాసి వెంకట గోపాల్ సూసైడ్ చేసుకున్నాడు.