Naga Vamsi : మొన్నటి వరకు రిలీజ్ డేట్ విషయంలో హరి హర వీరమల్లు, కింగ్‌డం సినిమాలు దోబూచులాటలాడాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, తర్వాత వాయిదా వేసుకోవాడం.. ఇలా జరుగుతూ వచ్చింది. ఫైనల్‌గా ఇప్పుడు ఈ రెండు సినిమాలు తమ తమ రిలీజ్ డేట్స్‌ను మరోసారి అనౌన్స్ చేశాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు నిర్మాత నాగ వంశీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా ? లేదా ఆ మాటను తప్పాడా ? అనేది చర్చ జరుగుతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…
ఇటు కింగ్‌డం, అటు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేని రోజులు అవి. ఈ టైంలో కింగ్‌డం నిర్మాత నాగ వంశీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట ఇచ్చాడు. ఈ మాట కోసమే.. కింగ్‌డం సినిమా చాలా సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఇవ్వడంతో.. నాగ వంశీ కూడా తన కింగ్‌డం సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు.
జూలై 31న తన కింగ్‌డం సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది అంటూ నిన్న (సోమవారం) అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో పవన్ కళ్యాణ్ కు ఆయన సినిమాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాట్టేనా ?
హరి హర వీరమల్లు సినిమాను జూలై 24న రిలీజ్ చేయబోతున్నారు. కింగ్ డం మూవీ రిలీజ్ డేట్ జూలై 31. అంటే ఈ రెండు సినిమాల మధ్య కేవలం ఒకే ఒక్క వారం ఉంది. అంటే పవన్ సినిమాకు ఒక వారం సరిపోతుంది అని నిర్మాత నాగ వంశీ అనుకుంటున్నాడా? అప్పుడు మాట ఇచ్చి… ఇప్పుడు పోటీ లేదు అన్నట్టు వేరే డేట్ సెలెక్ట్ చేసుకున్నా… ఇంపాక్ట్ క్రియేట్ చేసేలానే రిలీజ్ డేట్ ఇచ్చాడు కదా అంటూ పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఒక్క వారం దానికి మాట ఇవ్వడం ఎందుకు ? అంటూ ఫైర్ అవుతున్నారు. నాగ వంశీ ఇచ్చిన కింగ్ డం డేట్ వల్ల హరి హర వీరమల్లు కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపబోతుంది అనే మాట కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
హరి హర వీరమల్లు సినిమాను దాదాపు 6 ఏళ్ల పాటు నిర్మించారు. అందువల్ల అనుకున్న దాని కంటే బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. పెట్టిన బడ్జెట్.. ఫైనాన్స్… దానికి ఇంట్రెస్ట్.. ఇలా నిర్మాతపై చాలా ఒత్తడి పడింది అనేది నిజం. అవి ఇప్పుడు రిటర్న్ అవ్వాలంటే, చాలా టైం పడుతుంది. మినిమం 30 రోజుల కంటే ఎక్కువ థియేటర్ రన్ దొరకాలి. అందులో కనీసం మూడు వారాల పాటు అయినా… సింగిల్ రన్ దొరకాలి.
ఇవి అన్నీ కూడా నిర్మాత నాగ వంశీకి తెలుసు. అందుకే గతంలో, హరి హర వీరమల్లు మూవీకి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి వచ్చేది లేదు అని ప్రకటించాడు. కానీ, ఇప్పుడు కేవలం ఒక్క వారం వ్యవధిలోనే తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.
అంటే… ఇప్పుడు నాగ వంశీ మాట తప్పినట్టా ? లేదా మాట నిలబెట్టుకున్నట్టా ?