Natti Kumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా 100కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ (Fish Venkat)ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన కిడ్నీ ఫెయిల్యూర్(Kidney Failure) సమస్యతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారు. తమకు ఎవరైనా సహాయం చేయాలి అంటూ తన కుటుంబ సభ్యులు ఇటు ఇండస్ట్రీని, అటు ప్రభుత్వాన్ని కూడా వేడుకున్నారు. అయితే ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన లేదు అలాగే ఫిష్ వెంకట్ మరణించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు ఎవరు కూడా ఆయన మరణం పై స్పందించలేదు.
సినిమా ఇండస్ట్రీ ఓ బిజీ ప్రపంచం..
ఈ క్రమంలోనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా సినీ ఇండస్ట్రీ గురించి ఫిష్ వెంకట్ విషయంలో విమర్శలు రావడంతో తాజాగా నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) స్పందించారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ..”ఫిష్ వెంకట్ కు గత కొంతకాలంగా సినిమా పరిశ్రమతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. పరిశ్రమతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వారు మరణిస్తే సినిమా సెలబ్రిటీలందరూ అక్కడికి వెళ్తుంటారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బిజీ ప్రపంచం. ఎవరి పనులలో వాళ్లు బిజీగా ఉంటారు ఇక్కడ ఎవరు మరణించారు? ఏంటి? అని తెలుసుకునే అంత టైం కూడా ఎవరికి ఉండదని ఈయన తెలిపారు.
MAA లో సభ్యత్వం కూడా లేదు..
ప్రస్తుతం నేను చేసే ఈ వ్యాఖ్యలు ఫిష్ వెంకట్ కుటుంబానికి బాధ కలిగించవచ్చు అయితే రేపు నా కుటుంబానికి కూడా ఇదే పరిస్థితి రావచ్చు అంటూ ఈయన మాట్లాడారు. ఫిలిం ఛాంబర్ తో నిత్యం టచ్ లో ఉన్న వారికి ఏదైనా జరిగితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వెళ్తారని ఈయన తెలియజేశారు. ఇక ఫిష్ వెంకట్ ఎప్పుడు గబ్బర్ సింగ్ గ్యాంగ్ తో టచ్ లో ఉంటారు కనుక తను మరణిస్తే వాళ్లు మాత్రమే వెళ్లారని, ఇండస్ట్రీతో ఆయన టచ్ లో లేకపోవడం వల్లే ఎవరు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఫిష్ వెంకట్ మా అసోసియేషన్ లో మెంబర్ కూడా కాదు కనీసం ఆయనకు సభ్యత్వం కూడా లేదని నటి కుమార్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీ నుంచి సహాయం వస్తుందని ఎవరు ఆశించకండి రేపటి గురించి ఆలోచించి ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని ఈయన తెలియజేశారు.
ఆర్థిక సహాయం ఎవరు చేయరు…
ఫిష్ వెంకట్ కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే సంపాదించారు. ఈయన ఒక రోజుకు మూడు వేలు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుంచి 30 వేల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారని తెలిపారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలని సలహాలు కూడా ఇచ్చారు. ఆపద వస్తే ఎవరైనా మాట సహాయం చేస్తారేమో కానీ డబ్బు సహాయం అందరూ చేయరు అంటూ నట్టి కుమార్ ఫిష్ వెంకట్ మరణం గురించి ఆయన మరణం పట్ల సినిమా సెలబ్రిటీలు స్పందించకపోవడం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Also Read: Kireeti Reddy: వైరల్ వయ్యారి కోసం కిరీటి పాట్లు.. మోకాళ్ళు పగిలిన తగ్గట్లేదుగా?