Plane Crash: బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం పాఠశాల బిల్డింగ్ పై కూలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 19 మంది స్పాట్ లోనే మృతిచెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చుట్టు పక్కల స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.
ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలోని బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-7 బీజీఐ విమానం మైల్‌స్టోన్ స్కూల్ పై కూలింది. ఈ ఘటనలో 19 మందికి అక్కడికక్కడే మృతిచెందారు. 164 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మధ్యాహ్నం 1:06 గంటల సమయంలో టేకాఫ్ అయిన ఈ చైనా తయారీ విమానం, కొద్ది నిమిషాల్లోనే స్కూల్ భవనంపై కూలింది. ఈ సమయంలో విద్యార్థులు తరగతుల్లోనే ఉన్నారు. ఫలితంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
విమానం కూలిన వెంటనే మంటలు భారీగా చెలరేగాయి. స్కూల్ భవనానికి భారీ రంధ్రం పడింది. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం, స్థానికులు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో 48 మంది క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పైలట్ కూడా మరణించినట్లు నిర్ధారణ అయింది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి దర్యాప్తుకు హామీ ఇచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఈ ప్రమాదం ఢాకాలో ఇటీవలి కాలంలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం అని చెప్పవచ్చు.
ALSO READ: Air India Flight: రన్‌వే పై జారిపడ్డ విమానం.. ప్రయాణికులంతా ఒక్కసారిగా
ALSO READ: Sivakasi News: భారీ పేలుడు.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి