Kireeti Reddy: ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) కుమారుడు గాలి కిరీటిరెడ్డి(Gali Kireeti Reddy) సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాధాకృష్ణారెడ్డి(Radha Krishna Reddy) దర్శకత్వంలో కిరీటి, శ్రీ లీల (Sreeleela) హీరో హీరోయిన్లుగా నటించిన జూనియర్ సినిమా(Junior)ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జూలై 18వ తేదీ విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఇక కిరీటి రెడ్డికి ఇది మొదటి సినిమా ఆయనప్పటికీ అద్భుతమైన నటనను కనబరచడంతో ఈయన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వైరల్ వయ్యారి సాంగ్…
ఇక ఈ సినిమాలో కిరీటి శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన వైరల్ వయ్యారి సాంగ్ (Viral Vayyaari)ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాటలో డాన్స్ కూడా అద్భుతంగా చేశారు. అయితే ఈ అద్భుతమైన డాన్స్ వెనుక ఎంతో కష్టం ఉందని తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి షేర్ చేసిన ఒక వీడియో చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో మోకాళ్ళతో ఫ్లోర్ పై చేసే మూమెంట్ కోసం చాలా టేక్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 9 టేకుల తర్వాత ఆ మూమెంట్ ఫర్ఫెక్ట్ గా వచ్చిందని తెలుస్తుంది. ఇలా తొమ్మిది టేకులు తీసుకోవడంతో కిరీటి రెడ్డి మోకాళ్ళు మొత్తం గాయాలయ్యాయని డైరెక్టర్ షేర్ చేసిన వీడియోలో స్పష్టమవుతుంది.
మోకాళ్ళు గాయమై రక్తాలు..
ఇలా తన మోకాళ్ళు గాయమై రక్తాలు వస్తున్న ఈయన మాత్రం ఆ మూమెంట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఇన్ని టేక్స్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా నటన పట్ల ఆయనకు ఉన్నటువంటి డేడికేషన్ ఏంటో ఈ ఒక్క వీడియో ద్వారా డైరెక్టర్ తెలియచేశారు. అయితే కిరీట్ రెడ్డి హీరోగా పరిచయమైన సమయంలో ఎంతోమంది ఆయనపై విమర్శలు చేశారు. తను హీరో మెటీరియల్ కాదని డబ్బులుంటే ఎవరైనా హీరో కావచ్చు అంటూ విమర్శలు వచ్చాయి అయితే అలాంటి విమర్శలు చేసిన వారందరికీ ఈ వీడియో ఒక సమాధానంగా చెప్పవచ్చు.
?igsh=MXZycjMzdHJpYXU5aw%3D%3D
ఇక ఈ పాటలో శ్రీ లీల కిరీటి ఇద్దరు అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. ఇక నటన విషయంలో కానీ డైలాగ్ డెలివరీ విషయంలో కానీ ,డాన్స్ పరంగా, యాక్షన్ సన్ని వేషాలలో కిరీటి ఎంతో అద్భుతంగా నటించారు. జూనియర్ సినిమాలో ఈయన నటన చూస్తే ఇది మొదటి సినిమా అని కాకుండా ఎంతో అనుభవం ఉన్న నటుడు తరహాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా ద్వారా సీనియర్ నటి జెనీలియా(Genelia) కూడా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారాహి నిర్మాణం సంస్థలో తెరకెక్కిన ఈ సినిమా కోసం పెద్ద పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు . మొత్తానికి సినిమా అంటే ప్యాషన్ ఉన్న కిరీటిరెడ్డి జూనియర్ సినిమాతో అదరగొట్టారని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి ఎలాంటి సినిమాలు చేస్తారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Akshay Kumar: ఫోటోలు తీసిన అభిమాని.. ఫోన్ లాక్కున్న హీరో.. ప్రైవసీ ఇవ్వండంటూ!