Pant Wicket: ఇండియా – ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నేపథ్యంలో లండన్ లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభమైన మూడవ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. నాలుగేళ్ల విరామం తర్వాత ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ని తుది జట్టులోకి తీసుకున్నారు. భారత జట్టు బ్యాటర్లను కంట్రోల్ చేసేందుకు ఈ పేస్ బౌలర్ ని బరిలోకి దించారు. గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్.. కొన్నాళ్లుగా ఫిట్నెస్ ని మెరుగుపరుచుకోవడం మీద పనిచేశాడు.
Also Read: Injured Cricket Players: రక్తాలు కారినా… గ్రౌండ్ లో అడుగుపెట్టి మ్యాచ్ ఆడిన వీరులు వీళ్లే
ఇతడు 2021 ఫిబ్రవరి నుండి టెస్ట్ లకు దూరంగా ఉంటున్నాడు. కేవలం వన్డేలు, టి-20 ల్లోనే ఆడుతూ వస్తున్నాడు. అలాంటి ఆర్చర్ ఇప్పుడు పూర్తిగా రికవరీ అయి.. భారత్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లోని మూడో టెస్ట్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో జొఫ్రా ఆర్చర్ లైన్ మరియు లెంగ్త్ తో విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ ప్రారంభంలో రాణించినప్పటికీ.. భారత తొలి ఇన్నింగ్స్ లో లోయర్ ఆర్డర్ లో వికెట్లు పడగొట్టాడు.
తద్వారా భారత్ కి గట్టి షాక్ ఇచ్చాడు. ముఖ్యమైన మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, బుమ్రా వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టుకు ఊపిరి పోశాడు. అప్పటికే కాలు నొప్పితో బాధపడుతున్న రిషబ్ పంత్ వికెట్ భారత జట్టుకు కీలకమైంది. అదే సమయంలో ఆర్చర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు పంత్. 113వ ఓవర్ లోని మూడవ బంతిని మంచి లెంత్ తో బౌలింగ్ చేశాడు ఆర్చర్.
ఆ బంతి స్టంప్ దగ్గర నుండి స్వింగ్ అయింది. ఆ బంతిని డిఫెండ్ చేయడానికి పంత్ ప్రయత్నించడం విఫలమైంది. దీంతో బంతి నేరుగా స్టంప్ ని తాకింది. ఆ బంతి చాలా వేగంగా తగిలి స్టాంప్ గాల్లోకి ఎగిరి చాలా దూరం వెనక్కి వెళ్లి పడింది. ఇక పంత్ అని అవుట్ చేసిన తర్వాత జోఫ్రా ఆర్చర్ చాలా ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. స్టంప్ ని కాలితో తన్నుతూ సంబరాలు చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో గతంలో ఆర్చర్ ని నల్లజాతీయుడు అంటూ కామెంట్స్ చేశారని.. ఇప్పుడు అతడే ర** మొగుడు అయ్యాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Ben Stokes – Pant: రిషబ్ పంత్ కాలుపై కుట్రలు చేసిన స్టోక్స్.. కావాలనే ఆ బంతులు వేసి!
అయితే ఐపీఎల్ 2025 సమయంలో కామెంటేటర్ హర్భజన్ సింగ్.. ఆర్చర్ ని నల్లటాక్సీ తో పోల్చిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కి హిందీ కామెంటేటర్ గా వ్యవహరించిన హర్భజన్ సింగ్.. రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ ని నల్ల టాక్సీ తో పోల్చాడు. అప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసాయి. సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు హర్భజన్ పై దుమ్మెత్తిపోశారు. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు మైదానంలోకి అడుగుపెట్టిన ఆర్చర్.. అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకోవడంతో గతంలో అతడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మరోసారి వైరల్ అవుతున్నాయి.
?utm_source=ig_web_copy_link