Bigg Boss Agnipariksha: బుల్లి తెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇక తెలుగులో ఇప్పటికీ విజయవంతంగా 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే 9వ సీజన్ కూడా ప్రసారం కాబోతోంది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి బిగ్ బాస్ 9 (Bigg Boss 9)కార్యక్రమం ప్రసారం కాబోతుందని ఇదివరకే నిర్వాహకులు తెలియజేశారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలను చూస్తే కనుక ఈసారి ఈ కార్యక్రమం మరింత ఉత్సాహభరితంగా ఉండబోతుందని, అలాగే కఠినమైన టాస్కులు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
40 మంది ఎంపిక..
బిగ్ బాస్ 9 ఇది చదరంగం కాదు.. రణరంగం అంటూ నాగార్జున(Nagarjuna) చెబుతున్న మాటలు బట్టి చూస్తుంటే గెలవాలంటే యుద్ధం చేయాల్సిందేనని తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఈసారి కామన్ మ్యాన్ ఎంట్రీ(Common Man Entry) కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరిలో పాల్గొనడం కోసం నిర్వాహకులు ఇటీవల కాల్ ఫర్ ఎంట్రీస్ అంటూ సామాన్యులకు పెద్ద అవకాశం కల్పించారు. కాల్ ఫర్ ఎంట్రీస్ ద్వారా బిగ్ బాస్ వెళ్లాలనుకునే వారు మన వివరాలు అలాగే మనం ఎందుకు వెళ్లాలనుకుంటున్నామో ఒక వీడియో చేసి పంపిస్తే చాలు. అయితే ఈ కాల్ ఫర్ ఎంట్రీస్ కోసం లక్షలాదిమంది ఎంట్రీ చేసుకున్నారని వీరిలో కేవలం 40 మందిని మాత్రమే ఎంపిక చేసినట్లు తాజాగా మరొక వీడియోని ద్వారా తెలియజేశారు.
అసలైన అగ్నిపరీక్ష…
తాజాగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష(Bigg Boss Agnipariksha) అంటూ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ… “మీ అద్భుతమైన స్పందనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ తెలియజేయడమే కాకుండా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా 40 మందిని ఎంపిక చేసామని, ఇప్పుడు మొదలవుతుంది అసలైన పరీక్ష… అగ్నిపరీక్ష దాన్ని దాటుకొని ముందుకు బిగ్ బాస్ 9 హౌస్ లోకి ఎవరు వెళ్తారు చూద్దాం.. ఈసారి చదరంగం కాదు రణరంగం” అంటూ మరొక ప్రోమో వీడియోని విడుదల చేశారు.
ఇక ఈ వీడియో చూస్తుంటే మాత్రం కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఎంపికైన వారికి కూడా పెద్ద ఎత్తున టాస్కులను నిర్వహించే సెలెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఎవరి కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు, సెలబ్రిటీలు ఎవరు కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అనే విషయాలు తెలియాలి అంటే సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. అయితే నిత్యం ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
Also Read: Kushitha Kallapu: నా మొదటి ముద్దు అతనికే… ఆ సీన్లు చెయ్యను..బజ్జీ పాప కుషిత కామెంట్స్!