Shirish Reddy: ఎట్టకేలకు శిరీష్ రెడ్డి దిగొచ్చాడు. తాను అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటే క్షమించమని కోరాడు. ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు తమ్ముడు, నిర్మాత శిరీష్ రెడ్డి. రామ్ చరణ్ పై నిందలు వేసిన విషయం తెల్సిందే. గేమ్ ఛేంజర్ వలన తాము ఎంతో నష్టపోయామని, రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా చేసింది లేదని, ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇచ్చింది లేదని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. చరణ్ పై ఇన్ని ఆరోపణలు చేస్తే బాగోదని, మిగతా హీరోలు ఏమైనా డబ్బులు ఇచ్చారా.. ? పోనిలే అని సినిమా చేస్తే ఇంకా అతనిపై నిందలు వేస్తున్నారు. హిట్ అయితే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా.. ? ఎలా పడితే అలా చరణ్ పై నిందలు వేస్తే ఊరుకొనేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూ వలన దిల్ రాజు బ్యానర్ కు బాగా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డాడు దిల్ రాజు.
మొదట తమ్ముడు ప్రమోషన్స్ లో ఈ వివాదం గురించి దిల్ రాజు మాట్లాడాడు. చరణ్ తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయనతో కలిసి ఇంకో సినిమా కూడా చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. అయిపోయిన సినిమా గురించి మాట్లాడడం అనవసరం అని, నెగిటివిటి ఎందుకు వదిలేయమని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు తమ్ముడు సైతం క్షమించమని కోరాడు. తాజాగా శిరీష్ రెడ్డి రామ్ చరణ్ వివాదంపై స్పందించాడు. ఎవరి మనోభావాలైనా దెబ్బతీసి ఉంటే క్షమించమని కోరుతూ ప్రకటన రిలీజ్ చేశాడు.
“అందరికి నమస్కారం…! నేను ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు… సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. “గేమ్ ఛేంజర్” సినిమా కోసం మాకు “గ్లోబల్ స్టార్” రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే… క్షమించండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.